రూపాయికి ‘జీడీపీ’ బూస్ట్‌

2 Jun, 2018 00:46 IST|Sakshi

ముంబై: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2017–18 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి) చక్కటి పురోగతి (7.7 శాతం వృద్ధి) సాధించడం రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో శుక్రవారం డాలర్‌ మారకంలో రూపాయి ఏకంగా 35 పైసలు బలపడింది.

67.06 వద్ద ముగిసింది. ఇది నెల గరిష్ట స్థాయి. బ్రిటన్‌ పౌండ్, యూరో, జపాన్‌ యన్‌పై సైతం రూపాయి ర్యాలీ చేసింది. మౌలికరంగం ఏప్రిల్‌లో 4.7 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకోవడం కూడా రూపాయి బలోపేతానికి కారణమన్న విశ్లేషణలున్నాయి. గడచిన మూడు రోజుల్లో రూపాయి 80పైసలు లాభపడింది. కాగా, శుక్రవారం అమెరికాలో డాలర్‌ ఇండెక్స్‌ స్వల్ప లాభంతో 94.20 వద్ద టేడవుతోంది.

మరిన్ని వార్తలు