2016-17లో వృద్ధి 7.4 శాతం: హెచ్ఎస్ బీసీ

5 Apr, 2016 01:16 IST|Sakshi
2016-17లో వృద్ధి 7.4 శాతం: హెచ్ఎస్ బీసీ

న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.4% నమోదవుతుం దని ఆర్థిక సేవల దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ నివేదిక పేర్కొంది. దేశంలో వినియోగ డిమాండ్ వృద్ధికి దోహదపడే ప్రధాన అంశంగా నివేదిక పేర్కొంది. పెట్టుబడుల రికవరీ వేగవంతం అవుతుందని భావించనప్పటికీ, ఆర్థిక వ్యవస్థకు డిమాండ్ బలంగా మారనుం దని వివరించింది. నిలిచిపోయిన ప్రాజెక్టులు ఇంకా ఊపందుకోని పరిస్థితి వల్ల ఇన్వెస్టమెంట్ల క్రియాశీలతపై అనిశ్చితి నెలకొంటున్నట్లు విశ్లేషించింది.

మరిన్ని వార్తలు