జీడీపీ గణాంకాలను దలాల్‌ స్ట్రీట్‌ డిస్కౌంట్‌ చేసుకుంది

30 May, 2020 12:42 IST|Sakshi

తొందర్లోనే నిఫ్టీ 10వేల స్థాయిని పరీక్షించే అవకాశం

షార్ట్‌ కవరింగ్‌ కారణంగానే బ్యాంక్‌ షేర్లలో కొనుగోళ్లు

సామ్‌కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా అభిప్రాయం

దలాల్‌ స్ట్రీట్‌ జీడీపీ గణాంకాలను డిస్కౌంట్‌ చేసుకుందని సామ్‌కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా అంటున్నారు. ఈక్విటీ మార్కెట్ల కోణం నుంచి జీడీపీ గణాంకాలను పరిశీలిస్తే పూర్తిగా నెమ్మదించాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ అసాధారణ పరిస్థితులను ఎదుర్కోంటున్న నేపథ్యంలో జీడీపీ గణాంకాల అవుట్‌లుక్‌ను పరిగణలోకి తీసుకోవడం మంచిది కాదన్నారు. స్టాక్‌ మార్కెట్‌ జీడీపీ గణాంకాలకు లోబడి ట్రేడవదని, కేవలం ఈవెంట్స్‌కు మాత్రమే ప్రభావితం అవుతుందన్నారు. స్టాక్‌ మార్కెట్‌ను అంచనా వేయడానికి వాస్తవికతను పరిగణాలోకి తీసుకోవాలని ఉమేష్‌ మెహతా చెప్పారు. 

తొందర్లోనే నిఫ్టీ 10వేల స్థాయిని పరీక్షించే అవకాశం
కొద్ది రోజుల్లోనే నిఫ్టీ ఇండెక్స్ 10వేల స్థాయిని పరీక్షించే అవకాశం ఉందని మెహతా అంచనా వేస్తున్నారు. స్టాక్‌ మార్కెట్‌లో మే చివరివారం నుంచి నెలకొన్న ఆశావహన వైఖరి, బుల్లిష్‌ ధోరణిలు నిఫ్టీని 10వేలకు స్థాయిని పరీక్షింప చేస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఐతే 9900-10000 శ్రేణిలో నిఫ్టీ ఏర్పరుచుకున్న కీలక నిరోధాన్ని చేధించడటం కొంత కష్టతరమని మెహతా అంటున్నారు. 

షార్ట్‌ కవరింగ్‌ కారణంగానే బ్యాంక్‌ షేర్ల ర్యాలీ
కేవలం షార్ట్‌ కవరింగ్‌ కారణంగానే గత 3రోజుల నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లలో భారీగా కొనుగోళ్లు నెలకొన్నాయని మెహతా అన్నారు. భారత ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌ఐఐలు గత 3నెలలుగా నికర అమ్మకందారులుగా ఉన్నారు. అయితే మే 28న ఎక్స్‌పైజరీ సందర్భంగా వారు షార్ట్‌ కవరింగ్‌ చేయడంతో బ్యాంకింగ్‌ రంగ షేర్లలో మూమెంటం ఊపందుకుంది. అన్ని రకాలపై రుణాలపై 3నెలల మారిటోరియం, నిరర్ధక ఆస్తుల సైకిల్‌, పెరుగుతున్న నిరర్ధక రుణాలతో రానున్న రోజుల్లో బ్యాంకింగ్‌ షేర్ల తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కోనే అవకాశం ఉందని మెహతా అంచనా వేస్తున్నారు. ఈ ఏడాదికి బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కంటే కన్జూ‍్యమర్‌ షేర్ల కొనుగోలు ఉత్తమని అయన అభిప్రాయపడ్డారు. భారత్‌ లాక్‌డౌన్‌ కొనసాగితే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని మెహతా అంటున్నారు. 

>
మరిన్ని వార్తలు