ఇక లగ్జరీలన్నీ మరింత ప్రియం

30 May, 2016 19:00 IST|Sakshi
ఇక లగ్జరీలన్నీ మరింత ప్రియం

రూ. 10 లక్షల కన్నా ఖరీదైన కారు కొనాలనుకుంటున్నారా..? అయితే మీరు కారు ధర కంటే ఒక శాతం అదనపు మొత్తాన్ని భరించాల్సి ఉంటుంది. 2016-17 బడ్జెట్ లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.10 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లపై లగ్జరీ పన్నును జూన్ 1నుంచి విధిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ టాక్స్ పన్నును అమలుచేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ అదనపు పన్నును కారు అమ్మకం దారుడు వసూలు చేయాల్సి ఉంటుంది. ఎక్స్ షోరూం ధరలను బట్టి ఈ పన్ను విధిస్తామని అరుణ్ జైట్లీ వెల్లడించారు. 

అదేవిధంగా లగ్జరీ పన్నుతో పాటు కృషి కల్యాణ్ సెస్ పేరిట సర్వీసు పన్నులపై అదనంగా 0.50 శాతాన్ని అదనపు పన్నును వసూలు చేయనున్నారు. దీంతో ఇకనుంచి బయట రెస్టారెంట్లలో భోజనం చేయడం, ట్రావెలింగ్, ఇన్సూరెన్స్ , ప్రాపర్టీ కొనుగోలుకు ఫోన్లు చేయడం వంటివి ప్రియం కానున్నాయి. కృషి కల్యాణ్ సెస్ పేరిట 0.50 సర్వీసు పన్నును పెంచడంతో ఇప్పడివరకూ ఉన్న సర్వీసు టాక్స్ రేటు 14.5 శాతం నుంచి 15 శాతానికి పెరిగింది. గతేడాదే ఈ సర్వీసు టాక్స్ లను ఆర్థికమంత్రి పెంచారు. 12.36 గా సర్వీసు పన్నులను 14 శాతానికి చేశారు. స్వచ్ఛ్ భారత్ పేరిట మరోమారు 0.50 శాతం పెంచారు. ఈ ఏడాది కృషి కల్యాణ్ పేరిట మరో 0.50 శాతం అదనంగా సెస్ విధించనున్నట్టు అరుణ్ జైట్లీ బడ్జెట్ లో తెలిపారు. 

మరిన్ని వార్తలు