జనరల్‌ ఇన్సూరెన్స్‌- గెయిల్‌.. జూమ్‌

25 Jun, 2020 12:44 IST|Sakshi

గతేడాది క్యూ4 ఫలితాల ఎఫెక్ట్‌

4.5% జంప్‌చేసిన జీఐసీ ఆర్‌ఈ

గెయిల్‌ ఇండియా షేరు 3.5% అప్‌

ప్రపంచ మార్కెట్ల బలహీనతలు, జూన్‌ ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్లకు లోనవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 177 పాయింట్లు క్షీణించి 34,692కు చేరగా.. 54 పాయింట్ల వెనకడుగుతో నిఫ్టీ 10,251 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాల కారణంగా పీఎస్‌యూ కౌంటర్లు జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(జీఐసీ ఆర్‌ఈ), గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి ప్రస్తావించదగ్గ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

జీఐసీ ఆర్‌ఈ
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో జీఐసీ ఆర్‌ఈ నికర లాభం 98 శాతం జంప్‌చేసి రూ. 1197 కోట్లను తాకింది. పన్నుకు ముందు లాభం మాత్రం నామమాత్ర వెనకడుగుతో రూ. 1101 కోట్లకు పరిమితమైంది. స్థూల ప్రీమియం ఆదాయం 14 శాతం పుంజుకుని రూ. 9217 కోట్లకు చేరగా.. పూర్తిఏడాదికి 15 శాతం అధికమై రూ. 51,030 కోట్లుగా నమోదైంది. ఈ నేపథ్యంలో జీఐసీ ఆర్‌ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 4.5 శాతం జంప్‌చేసి రూ. 160 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 165ను సైతం అధిగమించింది.

గెయిల్‌ ఇండియా
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో గెయిల్‌ ఇండియా నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ. 3018 కోట్లను తాకింది. పన్నుకు ముందు లాభం 47 శాతం జంప్‌చేసి రూ. 2556 కోట్లకు చేరింది. అయితే మొత్తం ఆదాయం 5 శాతం క్షీణించి రూ. 17,753 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో గెయిల్‌ ఇండియా షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం .5 శాతం లాభపడి రూ. 105 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 107 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. బుధవారం సైతం ఈ షేరు దాదాపు 3 శాతం బలపడింది.
 

మరిన్ని వార్తలు