అర్ధరాత్రి అదరగొట్టే గిఫ్ట్‌!

4 Aug, 2018 00:16 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బర్త్‌ డేకు విష్‌ చేయాలన్నా, ప్రేమను వ్యక్తపరచాలన్నా.. సందర్భమేదైనా సర్‌ప్రైజ్‌ ఉంటేనే థ్రిల్‌. దీంతో ఆనందం, ఆశ్చర్యం రెండూ రెట్టింపవుతాయి. కేక్, బెలూన్స్‌ వంటివి అర్ధరాత్రి ఇంటికి తీసుకెళ్లి ఇచ్చి ఆశ్చర్యపర్చడమే కాదండోయ్‌... రోడ్డు మీద వెళ్తుంటే సడెన్‌గా ఓ డ్యాన్సర్ల బృందం మన చుట్టూ ఫ్లాష్‌మాబ్‌ చేయడం, మనల్ని కిడ్నాప్‌ చేసి ప్రైవేట్‌ జెట్‌లో తీసుకెళ్లి లవ్‌ ప్రపోజ్‌ చేయడం... ఇలా ఒకటి రెండు కాదు బోలెడన్ని సర్‌ప్రైజ్‌లున్నాయంటున్నారు శక్తివేల్‌ పన్నీర్‌సెల్వం. ది6.ఇన్‌ పేరిట హైదరాబాద్‌లోనూ వందలాది మందిని ఆశ్చర్యపరుస్తున్న (సర్‌ప్రైజ్‌) తమిళనాడుకు చెందిన ఈ స్టార్టప్‌ గురించి మరిన్ని వివరాలు ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు. 
 
మాది కోయంబత్తూరులోని ఓ మధ్యతరగతి కుటుంబం. అక్కడే మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తయ్యాక పలు కంపెనీల్లో పనిచేశా. కేబుల్‌ టీవీ ఆపరేటర్‌గా నెలకు రూ.300  జీతంతో ప్రారంభించి బెంగళూరులోని ఓ ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ స్థాయికి చేరా. ఉద్యోగరీత్యా విదేశాల్లో తిరగడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు స్టార్టప్స్‌ ప్రారంభించడం, సక్సెస్‌ సాధించడం దగ్గరుండి చూశా. దీంతో మనమూ సొంతంగా కంపెనీ పెట్టాలని నిర్ణయించుకొని ఇండియాకు తిరిగొచ్చేశా. మరో స్నేహితుడు రాధాకృష్ణన్‌తో స్టార్టప్స్‌ గురించి చర్చించా. ఇద్దరం కలిసి 64 రకాల వ్యాపార ఐడియాలను జాబితాగా రూపొందించాం. ఇందులో టీ షాపు, పెట్రోల్‌ పంపు, గ్రీనరీ వంటి చాలా ఐడియాలున్నాయి. చివరికి మూలధన పెట్టుబడి తక్కువగా ఉండే సర్‌ప్రైజ్‌ గిఫ్టింగ్‌ వద్ద ఆగింది. పెట్టుబడి కూడా తక్కువే కాబట్టి దీనికే ఓకే అనుకొని 2009 నవంబర్‌లో రూ.50 వేల పెట్టుబడితో కోయంబత్తూర్‌ కేంద్రంగా ది6.ఇన్‌ను ప్రారంభించాం. వ్యక్తిగత సర్‌ప్రైజ్‌లను అందించడం ది6 ప్రత్యేకత. 

10 విభాగాలు; 38 రకాల సర్‌ప్రైజ్‌లు 
అర్ధరాత్రి కేక్, బొకేలు, బెలూన్స్, గిఫ్ట్స్‌ వంటివి డెలివరీ చేయడమే కాకుండా వ్యక్తిగత సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం ది6 ప్రత్యేకత. లవ్‌ ప్రపోజల్‌ సీన్స్, ప్రైవేట్‌ జెట్‌లో ప్రపోజల్, ఫ్లాష్‌ మాబ్, బాక్స్‌ ఆఫ్‌ బెలూన్స్, మెసేజ్‌ బాటిల్‌ వంటి 10 విభాగాల్లో 38 రకాల సర్‌ప్రైజ్‌లున్నాయి. ధరలు రూ.3 వేల నుంచి రూ.3.5 లక్షల వరకున్నాయి. బాక్స్‌లో బెలూన్స్‌ ధర రూ.3 వేలు, రూ.3.5 లక్షల సర్‌ప్రైజ్‌ ఏంటంటే.. 7 నిమిషాల పాటు ప్రపోజల్‌ సీన్‌ ఉంటుంది. దీన్ని రెమో సినిమాలో వినియోగించుకున్నారు కూడా. 

3 నెలల్లో ముంబై, ఢిల్లీలో.. 
ప్రస్తుతం కోయంబత్తూరు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో మా సేవలు అందుబాటులో ఉన్నాయి. స్థానికంగా రెస్టారెంట్లు, మాల్స్, కాఫీ షాప్స్, సింగర్స్, డ్యాన్సర్లు, ఆర్టిస్టులతో ఒప్పందం చేసుకున్నాం. 3 నెలల్లో ముంబై, ఢిల్లీ, పుణే, అహ్మదాబాద్‌ నగరాలకు విస్తరించనున్నాం. వచ్చే ఏడాది నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాలన్నది లక్ష్యం. చెన్నై, బెంగళూరులో ఓ ప్రైవేట్‌ జెట్‌ ఆపరేటర్‌తో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతానికి జెట్‌ సర్‌ప్రైజ్‌లు కేవలం ఆ రెండు నగరాల్లోనే ఉంది. నెల రోజుల్లో హైదరాబాద్‌కూ విస్తరించనున్నాం. 

రూ.50 లక్షల ఆదాయం.. 
గతేడాది 5 వేల సర్‌ప్రైజ్‌లను అందించాం. ఈ ఏడాది ఇప్పటివరకు వెయ్యి వరకు అందించాం. ప్రస్తుతం నెలకు 100 ఆర్డర్లు వస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి 20 వరకుంటాయి. హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (హెచ్‌ఎన్‌ఐ), ఐటీ ఉద్యోగులే ఎక్కువ కస్టమర్లున్నారు. మా మొత్తం కస్టమర్లలో 80 శాతం మహిళలే. గతేడాది రూ.50 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. ఈ ఏడాది 20 శాతం వృద్ధిని లకి‡్ష్యంచాం. మా మొత్తం ఆదాయంలో 15 శాతం వాటా హైదరాబాద్‌ నుంచి ఉంటుంది.  
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒక స్మార్ట్‌ఫోన్‌ రీఫండ్‌ అడిగితే..10 ఫోన్లు

స్పైస్‌ జెట్‌ చొరవ : 500 మందికి ఊరట  

భారత్‌లో బిలియన్‌ డాలర్ల పెట్టుబడి

రీట్స్‌ ద్వారా సీపీఎస్‌ఈ స్థలాల విక్రయం!

అమెజాన్, గూగుల్‌ దోస్తీ

జెట్‌ను ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలి

వినోదంలో యాప్‌లే ‘టాప్‌’

ఆ ఉద్యోగులను ఆదుకుంటాం..

మా బిడ్డలు ఆకలితో చచ్చిపోతే..బాధ్యులెవరు?

నిమిషానికో ఫోన్‌ విక్రయం

విరాట్‌ కోహ్లీ మెచ్చిన ఆట..

శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌10 శ్రేణిపై ఆఫర్లు

ఫిబ్రవరిలో జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌దే హవా

రిలయన్స్‌ ‘రికార్డ్‌’ లాభం

జెట్‌కు త్వరలోనే కొత్త ఇన్వెస్టర్‌!

ఆన్‌లైన్‌ రిటైల్‌... ఆకాశమే హద్దు!!

భారీ ఉద్యోగాల ‘డెలివరీ’!!

పడకేసిన ‘జెట్‌’

జెట్‌ రూట్లపై కన్నేసిన ఎయిర్‌ ఇండియా

ఆనంద్‌ మహీంద్ర ‘చెప్పు’ తో కొట్టారు..అదరహో

34 శాతం కుప్పకూలిన జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు

ముద్దు పెడితే...అద్భుతమైన సెల్ఫీ

లాభాల ప్రారంభం : అమ్మకాల జోరు

రిలయన్స్‌లో సౌదీ ఆరామ్‌కో పాగా!

హ్యుందాయ్‌ ‘వెన్యూ’ ఆవిష్కరణ 

భారత్‌లో యుహో  మొబైల్స్‌ ప్లాంట్‌ 

మైండ్‌ ట్రీ 200% స్పెషల్‌ డివిడెండ్‌

జెట్‌ క్రాష్‌ ల్యాండింగ్‌!

జెట్‌ ఎయిర్‌వేస్‌ కథ ముగిసింది!

ఇది ఎయిర్‌లైన్‌ కర్మ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడు రిషి, రైటర్‌ స్వాతిల నిశ్చితార్థం

అక్కడా మీటూ కమిటీ

మరోసారి జోడీగా...

కాపాడేవారెవరు రా?

రాణి పూంగుళలి

గ్యాంగ్‌ వార్‌