గిఫ్ట్‌ ట్యాక్స్‌ లేదుకానీ... ఐటీ ఉంది సుమా!

27 Aug, 2018 00:51 IST|Sakshi

1958లో గిఫ్ట్‌ ట్యాక్స్‌ (బహుమతి పన్ను) చట్టం ఉండేది. 1987లో పలు సవరణలతో చట్టాన్ని మార్చారు. 1998లో చట్టాన్ని ఉపసంహరించారు. ఇప్పుడు ఆదాయపు పన్ను (ఐటీ) చట్టంలోనే మిళితమైపోయిన గిఫ్ట్‌ ట్యాక్స్‌ అంశాలను పరిశీలిస్తే...

బహుమతి పుచ్చుకున్న వ్యక్తి దానికి విలువ కట్టి, తన ఆదాయంగానే పరిగణించాలి. ఇదీ జీతం, లాభం, ఇంటి అద్దె, కమీషన్, వడ్డీ, ఫీజులు, మూలధనం తరహాగానే భావించి, పన్ను మదింపులో భాగం చేయాలి.
 గిఫ్ట్‌ అంటే నగదు కావచ్చు. బంగారం.. వెండి.. ఆభరణాలు... షేర్లు... స్థిరచరాస్తులు మొదలైనవి కావచ్చు.  
 ఒకఆర్థిక సంవత్సరంలో రూ.50,000 ఆపైన గిఫ్ట్‌ ఆదాయంపైనే పన్ను ఉంటుంది. ఆ లో పు ఉంటే పన్ను మినహాయింపు వర్తిస్తుంది.  
   పెళ్లి సమయాల్లో వచ్చిన బహుమతులకు పన్ను భారం ఉండదు.
   వీలునామా ద్వారా సంక్రమించిన గిఫ్ట్‌లకూ పన్ను భారం ఉండదు.  
   మెరిట్‌ ఆధారత గిఫ్ట్‌లకూ పన్ను ఉండదు.  
    కొందరు బంధువుల నుంచి వచ్చిన గిఫ్ట్‌ల మీదా పన్ను ఉండదు.  

ఎవరా బంధువులు...
ఒక వ్యక్తి పేరు కృష్ణప్ప. పురుషుడు...ఇతనిపై గిఫ్ట్‌ భారం వేయని బంధువులు ఎవరంటే...  
 భార్య  
 అన్నదమ్ములు
అక్కచెల్లెళ్లు
భార్య అన్నదమ్ములు
 తండ్రి.. ఆయన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు
తల్లి... అమె అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు
 తాత
ముత్తాత
కొడుకు
మనవడు
మునిమనవడు
భార్య తండ్రి, తాత, ముత్తాత
ముందు పేర్కొన్న వారి భాగస్వాములు.

మరిన్ని వార్తలు