గీతాంజలి జెమ్స్‌కు మరో అధికారి గుడ్‌ బై

19 Feb, 2018 13:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  పీఎన్‌బీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గీతాంజలి జెమ్స్‌ సంస్థనుంచి మరో  టాప్‌ ఎగ్జిక్యూటివ్‌  తప్పుకున్నారు. రూ. 11,400కోట్ల భారీ కుంభకోణంలో  ప్రధాన నిందితుడు డైమండ్‌  వ్యాపారి నీరవ్‌మోదీ మామ,  మెహుల్‌ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్‌   ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌వో) చంద్రకాంత్  తన పదవికి రాజీనామా చేశారు.  వ్యక్తిగత కారణాల రీత్యా తాను  పదవినుంచి  వైదొలగుతున్నట్టు ప్రకటించారు. కాగా ఇప్పటికే గీతాంజలినుంచి  కంపెనీ సెక్రటరీ   ఫంకూరి వారంగీ రాజీనామా చేసిన సంగతి  తెలిసిందే.

మరోవైపు నీరవ్‌ మోదీ ఇంటిపైనా, ఆఫీసులపై  ఈడీ దాడులు సోమవారం కూడా కొనసాగుతున్నాయి. ముంబైలోని 5 ప్రాంతాల్లో,  సూరత్‌లోని 3 ఏరియాల్లో, ఔరంగాబాద్‌, ఢిల్లీలో  సోదాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. నీరవ్‌ కంపెనీకి చెందిన  ఉద్యోగులను సీబీఐ ప్రశ్నిస్తోందిఈ మెగా స్కాంలో గీతాంజలి జెమ్స్‌  షేరు వరుసగా నాలుగో రోజు సోమవారం కూడా   భారీగా పతనాన్ని నమోదు చేసింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో  10శాతానికి పైగా నష్టపోయింది.   ఈ మొత్తం నాలుగు సెషన్లలో 50 శాతానికిపై కుప్పకూలి రికార్డ్‌ కనిష్టాన్ని తాకింది.  ఫిబ్రవరి 14నుంచి ఇప్పటివరకూ  రూ. 344 కోట్ల రూపాయల గీతాంజలి మార్కెట్‌ క్యాప్‌ తుడిచిపెట్టుకుపోయింది.  అటు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు షేరు కూడా 10శాతానికి పైగా  నష్టపోయింది. 

మరిన్ని వార్తలు