జీఈఎస్‌-2017 ఉద్దేశం ఏమిటి?

23 Nov, 2017 14:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణా  రాజధాని నగరం హైదరాబాద్‌లో ఇపుడు ఎక్కడ చూసినా  గ్లోబల్‌  ఎంట్రపెన్యూయర్‌షిప్‌ సమ్మిట్‌ 2017  (జీఈఎస్), ఇవాంకా ట్రంప్‌ ఫీవరే కనిపిస్తోంది.  అటు  మహిళలకు పెద్ద పీట వేస్తున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు, ఇటు ఇవాంకా ట్రంప్‌ సందర్శన. దీంతో ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణా ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లను  ఆగమేఘాల  నిర్వహిస్తోంది.  ఈ నెల28-30 మధ్య జరగనున్న  గ్లోబల్‌  ఎంట్రపెన్యూయర్‌షిప్‌ సమ్మిట్‌ 2017  (జీఈఎస్)లో ఇవాంకా పాల్గొననున్నారు. అంతేకాదు తొలిసారి దాదాపు సగానికిపైగా (52.5శాతం) మహిళా ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ఇంతకీ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సులో ఏ చర్చించబోతున్నారు.  ఈ జీఈఎస్‌ ఉద్దేశం, లక్ష్యాలు ఏమిటి?

అంతర్జాతీయంగా ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చిస్తారు.  విరివిగా పెట్టుబడులను ఆకర్షించేందుకు,  గ్లోబల్‌ ఇన్వెస్టర్లను  ప్రోత్సాహాన్నివ్వడం,  యువ పారిశ్రామికవేత్తలు, స్టార్ట్‌ ఆప్‌ సంస్థలకు ప్రోత్సహించడం  ఈ సమ్మిట్‌ ప్రధాన ఉద్దేశంగా చెప్పవచ్చు.  ఈజీ బిజినెస్‌ నిర్వహణలో ప్రభుత్వం అండదండలు,  వ్యాపార నైపుణ్యాలను పెంచుకోవడం,  వినూత్న ఆలోచనలతో వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసేలా యువ పారిశ్రామికవేత్తలకు ముఖ్యంగా మహిళలు ప్రోత్సాహాన్నందించడమే ప్రధాన లక్ష్యం.  తద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారవేత్తలు, పెట్టుబడిదార్లను ఒక తాటిపైకి తీసురానున్నారు. అంతర్జాతీయంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలను పంచుకునేందుకు, సరికొత్త అవకాశాలను సృష్టించేందుకు వేదిక ఈ సమ్మిట్‌. ఈ నేపథ్యంలో వీరి మధ్య అనుసంధానకర్తగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది.

అమెరికాతో కలిసి నీతి ఆయోగ్ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఎనిమిదవ వార్షిక సదస్సులో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 127 దేశాలనుంచి  1500 మందికి పైగా ప్రతినిధులు  హాజరు కానున్నారు.  10పైగా దేశాలనుంచి మొత్తం మహిళా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కావడం విశేషం.  దక్షిణాసియాలో తొలిసారిగా ఈ సదస్సును  జరుగుతుండగా "ఉమెన్ ఫస్ట్, ప్రాస్పర్టీ ఫర్ ఆల్ " అనే  అంశం ఈ సదస్సులో హైలైట్‌గా నిలవనున్న సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు