ఒకే ఒక్క డాలర్ కు.. హ్యాకింగ్ అకౌంట్లు అమ్మకం

6 May, 2016 11:58 IST|Sakshi
ఒకే ఒక్క డాలర్ కు.. హ్యాకింగ్ అకౌంట్లు అమ్మకం

ఫ్రాంక్పర్ట్ : హ్యాక్ చేసిన వందల మిలియన్ల యూజర్ పేర్లు, పాస్ వర్డులు, ఈ-మెయిల్ అకౌంట్లు, వెబ్ సైట్లు రష్యా క్రిమినల్ వరల్డ్ లో వాణిజ్యం జరుగుతున్నాయట. 272.3 మిలియన్ అకౌంట్లు(2723 లక్షల అకౌంట్లు) చోరీ అయ్యాయట. వాటిలో ఎక్కువగా రష్యా ప్రముఖ ఈ-మెయిల్ సర్వీసు మెయిల్.రూ అకౌంట్లే ఉన్నాయని సెక్యురిటీ నిపుణులు చెబుతున్నారు.

మిగతా అకౌంట్లు గూగుల్, యాహు, మైక్రోసాప్ట్ యూజర్లకు సంబంధించినవి ఉన్నాయని హోల్డ్ సెక్యురిటీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఇన్ ఫర్ మేషన్ ఆఫీసర్ అలెక్స్ హోల్డెన్ తెలిపారు. నిగూఢంగా భధ్రపరిచిన సమాచారాన్ని దొంగలించబడటంలో ఇదే అతి పెద్దదని, రెండేళ్ల క్రితం అమెరికాలో బ్యాంకుల, రిటైలర్లపై సైబర్ అటాక్ ఇలానే జరిగాయని ఆయన వెల్లడించారు.
 
అయితే రష్యాకు చెందిన ఓ యువకుడు ఈ క్రైమ్ కు పాల్పడాడని హోల్డ్ సెక్యురిటీ కనుగొన్నది. కేవలం ఒకే ఒక్క డాలర్ కు  దొంగలించబడిన అకౌంట్లను అమ్మకానికి పెట్టినట్టు పేర్కొంది. వీటిలో 570 లక్షల అకౌంట్లు మెయిల్.రూ కు సంబంధించినవి ఉంటే, 400 లక్షల యాహు అకౌంట్లు, 330 లక్షల హాట్ మెయిల్ అకౌంట్లు, 240 లక్షల జీమెయిల్ అకౌంట్లు ఉన్నాయని హోల్డ్ సెక్యురిటీ చెప్పింది.  ఈ హ్యాకింగ్ డేటాసెట్ లో వేల సంఖ్యలో అమెరికా బ్యాంకింగ్, తయారీ, రిటైల్ కంపెనీల ఉద్యోగులకు సంబంధించిన యూజర్ పేరు, పాస్ వర్డులు ఉన్నాయని హోల్డ్ వెల్లడించింది.

మరిన్ని వార్తలు