తగ్గిన జీఎంఆర్‌ నష్టాలు

14 Feb, 2020 05:29 IST|Sakshi

క్యూ3లో రూ. 279 కోట్లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నష్టాలు కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.279 కోట్లకు తగ్గాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నష్టాలు రూ.542 కోట్లు. మరోవైపు స్థూల ఆదాయాలు రూ.1,958 కోట్ల నుంచి రూ. 2,196 కోట్లకు పెరిగాయి. కీలకమైన ఎయిర్‌పోర్ట్స్‌ విభాగం ఆదాయాలు రూ. 1,358 కోట్ల నుంచి రూ. 1,615 కోట్లకు, విద్యుత్‌ విభాగం ఆదాయాలు రూ.146 కోట్ల నుంచి రూ.207 కోట్లకు పెరిగినట్లు జీఎంఆర్‌ వెల్లడించింది. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సామర్థ్యాన్ని 1.2 కోట్ల నుంచి (వార్షికంగా) 3.4 కోట్లకు పెంచే దిశగా విస్తరణ పనులు షెడ్యూల్‌ ప్రకారం జరుగుతున్నాయని పేర్కొంది. క్యూ3లో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల ట్రాఫిక్‌ 55 లక్షల నుంచి 9 శాతం వృద్ధితో 59 లక్షలకు చేరగా, ఢిల్లీ విమానాశ్రయంలో 6 శాతం పెరిగి 1.87 కోట్లకు చేరినట్లు తెలిపింది. 

మరిన్ని వార్తలు