చేనేత ఎ‍గ్జిబిషన్‌.. మ్యాజిక్‌ షాపింగ్‌

9 Mar, 2018 20:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : భారతదేశపు మొదటి ఆన్లైన్ మార్కెట్ ప్లేస్  గో కో-ఆప్ ‘'గో స్వదేశీ' పేరుతో  చేనేత, చేతివృత్తి నిపుణుల చేతుల్లో రూపుదిద్దుకున్న ఉత్పత్తులతో​   ఒక ఎగ్జిబిషన్‌  ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో అయిదు రోజులపాటు నిర్వహించనున్న  ఈ ఎగ్జిబిషన్‌ను శుక్రవారం ప్రారంభించింది.  చేతివృత్తి నిపుణులచే తయారు చేసిన ప్రామాణికమైన  చేనేత చీరలు సహా ఇతర ఉత్పత్తులు విస్తృత శ్రేణిలో ప్రదర్శనకు ఉంచింది.  భారతదేశంలోని అత్యుత్తమ నేత కళాకారులచే రూపొందించిన, అందమైన క్లిష్టమైన కళాఖండాలతో  ఈ సీజన్లో, ఇంతకుముందు ఎప్పుడూ లేనివిధంగా  ఉత్పత్తులను అందిస్తున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.

సమకాలీన, సంప్రదాయ పరిపూర్ణ కలయికతో, గో స్వదేశీ ఎక్సిబిషన్ లో క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, జమ్మూ & కాశ్మీర్, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల చేనేతకారుల ఉత్తమమైన  ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.  అందమైన డిజైన్లతో పాటు,  ఆక‌్షణీయమైన క్లాసిక్  ఉప్పాడ, పోచంపల్లి,  ఒడిషా ఐకాట్స్, టస్పర్‌, ఇల్కల్ చీరలు ఇక్కడ లభ్యం.

అలాగే కర్ణాటక కు చెందిన అద్భుతమైన మొలకల్‌మూరు, ఇల్కల్ చీరలు,  ఉత్సాహపూరితమైన బెంగాల్ జామ్‌ దానిస్ & తంగైల్ చీరలు, మహేశ్వరీస్ & చందేరిస్ లాంటి   అందమైన చేనేత చీరలు ఇక్కడ కొలువు దీరాయి. మిమ్మల్ని ఆశ్చర్యపరిచే సరసమైన ధరల్లో  స్వచ్ఛమైన పట్టు బనారాసీ చీరలు నేరుగా కొనుగోలు చేసే అవకాశం. తమిళనాడు హ్యాండ్ లూమ్స్ ప్రియుల కోసం  కో-ఆప్‌టెక్స్‌తన  స్టాల్‌ను  మొదటిసారి తన  ఉత్పత్తులను ప్రదర్శిస్తోంది.   కో -ఆప్‌టెక్స్‌ షాపులో తమిళనాడు సిల్క్ కాటన్ చీరలు మీకోసం..

అంతేకాదు బీహార్ ,కశ్మీర్ కు చెందిన ఎంబ్రాయిడరీ డ్రెస్ మెటీరియల్స్ కూడా ప్రదర్శనలో ఉన్నాయి.  కశ్మీర్‌ సంస్కృతిని, అక్కడి చేతి వృత్తి కళాకారుల నైపుణ్యాన్ని తలపించే బీడ్, థ్రెడ్ వర్క్ కు పేరు పొందిన కషిడ ఎంబ్రాయిడరీ ఉత్పత్తులు అలరి‍స్తున్నాయి. వీటితోపాటు హోం ఫుర్నిషింగ్స్‌, మెన్స్ వేర్ తో చేతితో తయారు చేసిన వెరైటీ స్టోల్స్, దుప్పట్టాలు  మీమ్మల్ని ఆకట్టుకోడానికి సిద్ధంగా ఉన్నాయి.  మరి ఇంకెందుకు ఆలస్యం? గో కో-ఆప్  'గో స్వదేశీ' ఎగ్జిబిషన్ ను సందర్శించండి .. వార్డ్‌ రోబ్ కు చేనేత మ్యాజిక్‌ను జోడించండి!!!

ప్రదేశం: కళింగ కల్చరల్ హాల్, బంజారా హిల్స్
సమయం: ప్రతి రోజు ఉదయం 11గంటలనుంచి రాత్రి 9 గంటల వరకు
ఎప్పటివరకు: మార్చి 9వ తేదీ- మార్చ్ 13 వ తేదీ వరకు

మరిన్ని వార్తలు