త్వరలో ఐపీవోకు గోద్రెజ్‌ అగ్రోవెట్‌

20 Jul, 2017 00:34 IST|Sakshi
త్వరలో ఐపీవోకు గోద్రెజ్‌ అగ్రోవెట్‌

సెబీకి ఐపీవో పత్రాల సమర్పణ
న్యూఢిల్లీ: గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ విభాగం గోద్రెజ్‌ అగ్రోవెట్‌ తాజాగా ఐపీవో పత్రాలను మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీకి అందజేసింది. కంపెనీ ఐపీవోలో భాగంగా రూ.300 కోట్ల విలువైన తాజా షేర్లను ఇష్యూ చేయనుంది. ఐపీవోలో భాగంగానే ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద కంపెనీ ప్రమోటర్‌ గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ రూ.300 కోట్ల వరకు విలువైన షేర్లను, టెమాసెక్‌ విభాగమైన వి–సైన్సెస్‌ 1.23 కోట్ల షేర్లను జారీ చేయనుంది.

కాగా కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా మొత్తంగా రూ.1,000–రూ.1,200 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. కాగా గోద్రెజ్‌ అగ్రోవెట్‌లో ప్రధానంగా గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌కు 60.81 శాతం, టెమాసెక్‌ హోల్డింగ్స్‌కు 19.99 శాతం వాటా ఉంది. గోద్రెజ్‌ అగ్రోవెట్‌ కంపెనీ అగ్రో ఇన్‌పుట్స్, పామ్‌ ఆయిల్‌ తయారీ, డెయిరీ, పౌల్ట్రీ వంటి వ్యాపారాల్లో ఉంది. కాగా గోద్రెజ్‌ అగ్రోవెట్‌ పబ్లిక్‌ ఇష్యూకు కొటక్‌ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్‌ క్యాపిటల్, క్రెడిట్‌ సూసీ సెక్యూరిటీస్‌ సంస్థలు బ్యాంకర్లుగా వ్యవహరించనున్నాయి. పబ్లిక్‌ ఇష్యూ తర్వాత కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టయ్యే అవకాశముంది.

మరిన్ని వార్తలు