గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ లాభం రూ.21 కోట్లు

2 Nov, 2018 01:31 IST|Sakshi

న్యూఢిల్లీ: గోద్రేజ్‌ గ్రూప్‌నకు చెందిన రియల్టీ కంపెనీ గోద్రేజ్‌ ప్రొపర్టీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో కన్సాలిడేటెడ్‌ ప్రాతపదికన రూ. 21 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.21 లక్షల నికర లాభం మాత్రమే వచ్చిందని గోద్రేజ్‌ ప్రొపర్టీస్‌ పేర్కొంది. ఆదాయం అధికంగా ఉండటం, పన్ను రివర్సల్, అధిక ఇతర ఆదాయం కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ ఫిరోజ్‌షా గోద్రేజ్‌ చెప్పారు.

 గత క్యూ2లో రూ.349 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.487 కోట్లకు పెరిగిందని వెల్లడించారు. ఈ క్యూ2లో అమ్మకాల బుకింగ్‌లు రూ.807 కోట్లుగా ఉన్నాయని ఫిరోజ్‌షా తెలియజేశారు. గత క్యూ2లో ఈ బుకింగ్‌లు రూ.1,335 కోట్లని, 14 శాతం క్షీణత నమోదైందని చెప్పారు. ఇతర ఆదాయం 161 శాతం పెరిగి రూ.94 కోట్లకు చేరుకుంది. గత క్యూ2లో పన్ను వ్యయాలు రూ.3.6 కోట్లుగా ఉండగా, ఈ క్యూ2లో రూ.17 కోట్ల ట్యాక్స్‌ క్రెడిట్‌ లభించింది.  

మరిన్ని వార్తలు