గోద్రేజ్ బీకేసీ ప్రాజెక్టును కొనుగోలు చేసిన అబాట్

1 Oct, 2015 00:54 IST|Sakshi
గోద్రేజ్ బీకేసీ ప్రాజెక్టును కొనుగోలు చేసిన అబాట్

డీల్ విలువ రూ.1,480 కోట్లు   అతి పెద్ద రియల్టీ లావాదేవీల్లో ఒకటి
న్యూఢిల్లీ: గోద్రేజ్ ప్రొపర్టీస్ సంస్థ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీలో)ని 4.35 లక్షల చదరపుటడుగుల కమర్షియల్ ప్రాజెక్ట్‌ను ఫార్మా దిగ్గజం అబాట్‌కు విక్రయించింది. ఈ డీల్ విలువ రూ.1,480 కోట్లు. భారత్‌కు సంబంధించి అతి పెద్ద రియల్ ఎస్టేట్ డీల్స్‌లో ఇదొకటి. ముంబైలో ఉన్న తన వ్యాపారాన్నంతటినీ ఒకే  ప్రాంతానికి తరలించే వ్యూహంలో భాగంగా అబాట్ కంపెనీ ఈ ప్రాజెక్ట్‌ను కొనుగోలు చేసింది.

ఇక్కడ కార్పొరేట్ కార్యాలయాన్ని ఏర్పాలు చేయాలని అబాట్ యోచిస్తోంది. కాగా ఈ నిధులతో కంపెనీ రుణ భారాన్ని తగ్గించుకుంటామని, భవిష్యత్ వృద్ధికి వినియోగించుకుంటామని గోద్రేజ్ ప్రొపర్టీస్ ఎండీ, సీఈఓ పిరోజ్‌షా గోద్రేజ్ చెప్పారు. ఇంకా ఈ ప్రాజెక్టులో తమకు 3 లక్షల చదరపుటడుగుల స్పేస్ ఉందని, త్వరలో ఈ స్పేస్‌ను కూడా విక్రయిస్తామని వివరించారు. జెట్ ఎయిర్‌వేస్‌తో కలిసి గోద్రేజ్ సంస్థ బీకేసీని అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ కార్యకలాపాలను లార్సెన్ అండ్ టుబ్రో చూస్తోంది. ఈ ఏడాది మార్చినాటికి గోద్రేజ్ ప్రొపర్టీస్ రుణ భారం రూ.2,764 కోట్లుగా ఉంది.

>
మరిన్ని వార్తలు