మూడేళ్లలో మూడో స్థానానికి గోద్రెజ్‌

12 Oct, 2017 05:07 IST|Sakshi

గృహోపకరణాల విపణిలో కంపెనీ లక్ష్యమిది

ఇన్నోవేషన్‌కు పెద్ద పీట వేస్తున్నాం

గోద్రెజ్‌ అప్లయన్సెస్‌హెడ్‌ కమల్‌ నంది

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గృహోపకరణాల రంగంలో దేశంలో 2020 నాటికి మూడో స్థానాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు గోద్రెజ్‌ వెల్లడించింది. ప్రస్తుతం 11–12 శాతం వాటాతో నాల్గవ స్థానంలో ఉన్నట్టు గోద్రెజ్‌ అప్లయన్సెస్‌ బిజినెస్‌ హెడ్‌ కమల్‌ నంది తెలియజేశారు. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా వినూత్న ఆవిష్కరణలపై ఫోకస్‌ చేశామన్నారు. ఇందుకు పరిశోధనపై భారీగా వ్యయం చేస్తున్నామని చెప్పారు. గతేడాది కంపెనీ టర్నోవర్‌ రూ.3,300 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,000 కోట్లు లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడించారు. అలెర్జీ ప్రొటెక్ట్‌ ఫీచర్‌తో గోద్రెజ్‌ ఇయాన్‌ ఫ్రంట్‌ లోడింగ్‌ వాషింగ్‌ మెషీన్‌ను బుధవారమిక్కడ విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అలెర్జీ కారక క్రిములు, బ్యాక్టీరియాను ఈ వాషింగ్‌ మెషీన్‌ దూరం చేస్తుందని వివరించారు.

నవంబరులో కొత్త ధరలు..
రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్ల వంటి గృహోపకరణాల ధరలు నవంబరు నుంచి 3–4 శాతం పెరిగే చాన్స్‌ ఉందని కమల్‌ నంది వెల్లడించారు. స్టీల్, కాపర్‌ తదితర ముడి సరుకుల వ్యయాలు ప్రియం కావడమే ఇందుకు కారణమన్నారు. ఇక దేశవ్యాప్తంగా గృహోపకరణాల పరిశ్రమ వృద్ధి రేటు 2016లో 15 శాతం నమోదైంది. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు కారణంగా వృద్ధి 2017 జనవరి–జూన్‌లో 5–7%కి పరిమితమైంది. మొత్తంగా ఈ ఏడాది వృద్ధి 10–12 శాతం ఉంటుందని అంచనాగా చెప్పారు. జీఎస్‌టీకి ముందు గృహోపకరణాల మీద పన్ను రాష్ట్రాన్నిబట్టి 23–26 శాతం ఉండేదన్నారు. జీఎస్‌టీ రాకతో ఇది 28 శాతానికి చేరిందని వివరించారు. గృహోపకరణాలను లగ్జరీగా చూడొద్దని, అవసమైన వస్తువులుగా పరిగణించి పన్ను తగ్గించాల్సిందిగా ప్రభుత్వాన్ని పరిశ్రమ కోరుతోందన్నారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

10 వేల ఉద్యోగాలు ప్రమాదంలో 

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు 

భారత పారిశ్రామికవేత్త అరెస్ట్‌

ఆర్‌బీఐ ‘ఉత్కర్ష్‌ 2022’

నిలిచిపోయిన ముకేశ్‌ డీల్‌..!

కంపెనీలకు డేటా చోరీ కష్టాలు

‘59 మినిట్స్‌’తో రూ. 5 కోట్లు!

తగ్గిన ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ నష్టాలు

ఫ్లాట్‌ ప్రారంభం : 38 వేల ఎగువకు సెన్సెక్స్‌

38వేల దిగువకు సెన్సెక్స్‌

హెచ్‌యూఎల్‌ లాభం రూ.1,795 కోట్లు

హైదరాబాద్‌లో పేపాల్‌ టెక్‌ సెంటర్‌

జగన్‌! మీరు యువతకు స్ఫూర్తి

బీఎస్ఎన్‌ఎల్‌ స్టార్‌ మెంబర్‌షిప్‌ @498

ఎల్‌ అండ్‌ టీ లాభం రూ.1,473 కోట్లు

2018–2019కు ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు పొడిగింపు

హ్యుందాయ్‌ కార్ల ధరలు మరింత ప్రియం

జీడీపీ వృద్ధి రేటు ‘కట్‌’కట!

ఫార్చూన్‌ ఇండియా 500లో ఆర్‌ఐఎల్‌ టాప్‌

‘ఇల్లు’ గెలిచింది..!

మహీంద్ర ట్వీట్‌.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

రూ 1999కే ఆ నగరాలకు విమాన యానం

అనిల్‌ అంబానీ కంపెనీల పతనం

మార్కెట్ల రీబౌండ్‌

మరో సంచలనానికి సిద్ధమవుతున్న జియో

క్రిప్టోకరెన్సీ అంటే కఠిన చర్యలు

టీఎస్‌ఎస్‌ గ్రూప్‌లో ఆర్‌వోసీ సోదాలు!

ప్రింట్‌ను దాటనున్న ‘డిజిటల్‌’

లాభాల బాటలోనే ఓబీసీ..

ఆమ్రపాలి గ్రూపునకు సుప్రీం షాక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆగస్ట్ 9న అనసూయ ‘కథనం’

బిల్లు చూసి కళ్లు తేలేసిన నటుడు..!

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’