షేర్ల బేజారుతో బంగారానికి క్రేజు..

23 Mar, 2020 19:01 IST|Sakshi

ముంబై : కరోనా వైరస్‌ వ్యాప్తిపై నెలకొన్న భయాందోళనలతో ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడం స్వర్ణానికి కలిసివచ్చింది. మహమ్మారి వైరస్‌ షేర్‌ మార్కెట్‌ను షేక్‌ చేస్తుండటంతో మదుపరులు బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. షేర్లను తెగనమ్మి బంగారంలోకి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మళ్లించడంతో హాట్‌మెటల్‌ కాస్ల్టీగా మారింది. పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి.

బంగారానికి డిమాండ్‌ పెరగడంతో సోమవారం ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల పసిడి రూ 517 ఎగిసి రూ 40,875 పలికింది. ఇక కిలో వెండి ఏకంగా రూ 1259 పెరిగి రూ 37,102కు చేరింది. డెడ్లీ వైరస్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందన్న ఆందోళనతో బంగారం ధరలు రాబోయే రోజుల్లో మరింత ఎగబాకుతాయని బులియన్‌ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు.

చదవండి : గుడ్‌ న్యూస్‌ : భారీగా తగ్గిన బంగారం

మరిన్ని వార్తలు