రుపీ దెబ్బ: బంగారం ధరలకు రెక్కలు?

17 Sep, 2018 20:34 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: త్వరలోనే బంగారం ధరలకు రెక‍్కలు రానున్నాయా? తాజా అంచనాల  ప్రకారం  బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు  చేస్తోంది.  ప్రస్తుతం పసిడిపై  వసూలు చేస్తున​ 10 శాతం దిగుమతి సుంకానికి అదనంగా మరో రెండు నుండి మూడు శాతం పెంచే అవకాశం ఉం​దని  అంచనా. ముఖ్యంగా  దేశీయ కరెన్సీ రోజురోజుకీ చారిత్రక  కనిష్టానికి పడిపోతున్న తరుణంలో బంగారం ధరలపై ప్రభావ పడనుందని  మార్కెట్‌వర్గాలు  అంచనా వేస్తున్నాయి. తద్వారా కరెంట్ అకౌంట్ లోటు (CAD) నియంత్రణకు ఉంచడానికి కేంద్రం  యోచిస్తోందని భావిస్తున్నాయి.   కాగా ఆగస్టు నెలలో బంగారం దిగుమతి బిల్లు దాదాపు రెట్టింపై 3.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

కాగా భారత ఆర్థిక మంత్రిత్వశాఖ గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కరెంటు ఖాతా లోటు  మార్చి 2018 నాటి 1.9 శాతం నుంచి  2.4 శాతానికి పెరిగింది.  అలాగే రూపాయి విలువ క్షీణత,  అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదల  కారణంగా విలావస్తువులపై దిగుమతి సుంకం పెంచేందుకు ప్రభుత్వ మొగ్గు  చూపవచ్చు.  దిగుమతి సుంకాన్ని 2 శాతానికి పెంచుకోవడమే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఉత్తమ మార్గమని  సుశీంద్ర మెహతా, ఇండియా బులియన్ అండ్ జ్యూయలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ)  అభిప్రాయపడింది.  2013 లో, రూపాయి  విలువ క్షీణించిన నేపథ్యంలో  బంగారంపై ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని  10 శాతానికి  పెంచిన  సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు