15 నుంచి గోల్డ్‌ బాండ్స్‌ స్కీమ్‌

9 Oct, 2018 00:35 IST|Sakshi

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సార్వభౌమ పసిడి బాండ్ల పథకం అక్టోబర్‌ 15న ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 19 దాకా దరఖాస్తు చేసుకోవచ్చు. 23న బాండ్ల జారీ ఉంటుంది. ఫిబ్రవరి దాకా మొత్తం అయిదు విడతల్లో బాండ్ల జారీ ఉండనున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది.  తదుపరి విడతల తేదీలు నవంబర్‌ 5–19 (నవంబర్‌ 13న జారీ), డిసెంబర్‌ 24–28 (జారీ జనవరి 1), జనవరి 14–18 (జారీ జనవరి 22), ఫిబ్రవరి 4–8 (జారీ ఫిబ్రవరి 12)గా ఉంటాయని వివరించింది.

బ్యాంకులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, నిర్దిష్ట పోస్ట్‌ ఆఫీసులు, స్టాక్‌ ఎక్సే్చంజీలైన ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు. మరోవైపు, వడ్డీ రేట్లు తగ్గినప్పుడల్లా రుణగ్రహీతలకు ఆ ప్రయోజనాలను బదలాయించడంలో బ్యాంకులు జాప్యం చేస్తుండటంపై అభిప్రా యాన్ని ఆరు వారాల్లోగా తెలియజేయాల్సిందిగా ఆర్‌బీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది.

మరిన్ని వార్తలు