ఇక గోల్డ్ షాపులు కళకళ

12 Apr, 2016 11:26 IST|Sakshi
ఇక గోల్డ్ షాపులు కళకళ

ముంబై : కేంద్రం విధించిన ఒక శాతం సెంట్రల్ ఎక్సైజ్ పన్నును వ్యతిరేకిస్తూ దాదాపు ఆరు వారాలుగా బంగారం వర్తకులు చేస్తున్న బంద్ ఎట్టకేలకు ముగిసింది. దీంతో దేశంలో సగానికి పైగా బంగారు దుకాణాలు తెరుచుకున్నాయి. ఎక్సైజ్ శాఖ నుంచి  బంగారు వర్తకులకు వేధింపులు లేకుండా చూస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో తమ బంద్ ను ఆపివేశామని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్ డైరెక్టర్ బచ్ రాజ్ బమాల్వ తెలిపారు.

ఆరు వారాల తర్వాత తెరుచుకున్నా షాపుల్లో బంగారు డిసౌంట్స్ పడిపోతున్నాయి. 40 డాలర్లుగా ఉన్న బంగారు డిసౌంట్స్ ను డీలర్లు 25 డాలర్లకు ఆఫర్ చేస్తున్నారు. మరోవైపు ఇది పెళ్లిళ్లు, పండుగల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ కూడా బాగా పెరుగుతోందని ఎంఎన్సీ బులియన్ డైరెక్టర్ దమన్ ప్రకాశ్ రాథోడ్ తెలిపారు.

బంగారు దుకాణాల బంద్, ధరలు ఎక్కువగా ఉండటంతో మార్చి క్వార్టర్ లో గోల్డ్ కొనుగోలు తగ్గాయని, ఏడు ఏళ్ల కనిష్టానికి పడిపోయాయని పేర్కొన్నారు. ఈ వారాంతం వరకు అన్ని బంగారు దుకాణాలు తెరుచుకుంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు