దిగొస్తున్న పసిడి ధరలు

22 Feb, 2016 15:37 IST|Sakshi

ముంబయి : స్టాక్‌ మార్కెట్లలో లాభాలు, పెట్టుబడులను బంగారం నుంచి ఈక్విటీలకు మరలేలా చేశాయి. దీనికి తోడు రూపాయి బలపడటం బంగారం ధరలు తగ్గేలా చేసింది. దీంతో బంగారం ధర 674 రూపాయలు తగ్గింది. 10గ్రాముల బంగారం ధర ఎంసీఎక్స్‌లో 28వేల 841రూపాయలుగా ఉంది. అదే విధంగా వెండి ధరలు సైతం తగ్గాయి. కిలో వెండి ధర 967 రూపాయలు తగ్గి 36వేల 550 రూపాయలుగా ఉంది. అయినప్పటికీ ఔన్స్‌ బంగారం ధర 1207 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. మార్కెట్లు మరింత లాభపడితే బంగారం ధరలు తగ్గే ఛాన్స్‌ ఉందని అనలిస్ట్‌లు చెపుతున్నారు.  ఇక హైదరాబాద్‌లో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 27వేల 700 రూపాయలు  కాగా, కిలో వెండి ధర 37వేల 930 రూపాయలుగా ఉంది.
 

కాగా దేశీయ స్టాక్ మార్కెట్లు  సోమవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 79 పాయింట్ల లాభంతో 23,788 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 7,234 వద్ద ముగిసింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఆ ప్రభావం మన మార్కెట్లపై పడింది. మరోవైపు నిన్న మొన్నటి వరకూ మెరిసిన పసిడి ధర కూడా తగ్గింది.

మరిన్ని వార్తలు