రూ.48వేలపైన ముగిసిన బంగారం

27 Jun, 2020 15:14 IST|Sakshi

రూ.48589 వద్ద ఆల్‌టైం హైని తాకిన బంగారం 

వారం మొత్తం మీద రూ.364 లాభం

అంతర్జాతీయంగా 3వారమూ లాభాల ముగింపే

దేశీయంగా బంగారం ధర ఈ వారాంతపు రోజైన శుక్రవారం రూ.48000 పైన ముగిసింది. ఎంసీఎక్స్‌లో శుక్రవారం రాత్రి 10గ్రాముల బంగారం ధర రూ.364లు లాభపడి రూ.48305 వద్ద స్థిరపడింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల పెరగడం, చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలు మరింత ముదరడం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్‌ పెరగడంతో ఈ బుధవారం దేశీయంగా బంగారం ధర రూ.48589 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే. అయితే జీవితకాల గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం, ఈక్విటీల పట్ల ఇన్వెసర్టు మొగ్గచూపడం, అంతర్జాతీయంగా డాలర్‌ అనూహ్యంగా రివకరీ కావడం తదితర కారణాలు పసిడి లాభాల్ని పరిమితం చేశాయి. ఫలితంగా గరిష్టం నుంచి రూ.284లు నష్టాన్ని చవిచూసింది. ఇక వారం మొత్తం మీద రూ.368లు లాభపడింది.

అంతర్జాతీయంగా 3వారమూ లాభాల ముగింపే: 
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర లాభంతో ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా రెండోదశ కరోనా కేసుల నమోదుకావడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులను బంగారంలోని మళ్లించారు. దీంతో నిన్నరాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర 10డాలర్ల లాభంతో 1780 డాలర్ల వద్ద ముగిసింది. వారంపరంగా చూస్తే బంగారానికి వరుసగా 3వారమూ లాభాల ముగింపు కావడం విశేషం. ఈ గురువారం 1,796డాలర్ల వద్ద 8ఏళ్ల గరిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే. 

కోవిడ్‌-19 కేసులు మరింత పెరుగుతుండటంతో ఆర్థిక వ్యవస్థ రికవరీ మరింత ఆలస్యం కావచ్చనే అంచనాలు బంగారాన్ని రికార్డు స్థాయిల వైపు నడిపిస్తున్నాయని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తలు