ఏడాది గరిష్టానికి పసిడి ధరలు

24 Oct, 2018 19:13 IST|Sakshi

సాక్షి, ముంబై:  పండుగ సీజన్ సందర్భంగా కొనుగోళ్లు పెరగడంతో పసిడి మిసమిసలాడుతోంది.  అంతర్జాతీయ  సంకేతాలతో బంగారం ధరలు బుధవారం సంవత్సర గరిష్టానికి   చేరాయి. 10 గ్రాముల బంగారం  రూ. 150 పెరిగి రూ. 32,500కు చేరింది. అయితే  వెండి కిలో మీద స్వల్పంగా.. అంటే రూ. 20 తగ్గి రూ. 39,730గా పలుకుతోంది.

ప్రపంచ మార్కెట్లో  కొనసాగుతున్న కొనుగోళ్లతో పాటు స్థానిక జువెల్లర్స్ జరుపుతున్న ట్రేడింగ్స్ తో   పుత్తడి ధరలు  నింగివైపు చూస్తున్నాయి. విదేశీ మార్కెట్లో ధోరణి, పండుగ, పెళ్లిళ్ల సీజన్ కారణంగా స్థానిక నగలవారి కొనుగోలుతో ఈ ఏడాది అత్యధికంగా బంగారం ధరలను పెంచింది. జాతీయ రాజధానిలో, 99.9% బంగారం మరియు 99.5% స్వచ్చత బంగారం 10 గ్రా.150 రూపాయలు పెరిగి వరుసగా రూ.32,500, రూ.32,350గా ఉంది. సావరిన్ చాలా ఎనిమిది గ్రాములు ధర రూ. 100పెరిగా  24,800ని తాకింది. మరోవైపు ధంతేరస్‌, దీపావళి పర్వదినాలు సమీపిస్తున్న దృష్ట్యా  కొనుగోళ్లు పుంజుకుని, ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రేడర్ల అంచనా.

మరిన్ని వార్తలు