పసిడి దిగుమతులు డౌన్

5 Nov, 2016 01:08 IST|Sakshi
పసిడి దిగుమతులు డౌన్

ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో 55% తగ్గాయ్..
క్యాడ్ కట్టడికి  దోహదం 

 న్యూఢిల్లీ: పసిడి దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో  (2016-17, ఏప్రిల్-సెప్టెంబర్) ఏకంగా 55 శాతం పడిపోయారుు. 7.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యారుు. ఇది కరెంట్ అకౌంట్ లోటుకు (క్యాడ్- ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారక ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) సానుకూల అంశమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నారుు. 2015 ఇదే కాలంలో పసిడి దిగుమతుల విలువ 17.42 బిలియన్ డాలర్లు. ఒక్క సెప్టెంబర్‌లో చూస్తే, దిగుమతులు 10.3 శాతం పడిపోరుు, 1.8 బిలియన్ డాలర్లుగా నమోదరుునట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు తెలిపారుు.

2015 సెప్టెంబర్‌లో క్యాడ్ 10.16 బిలియన్ డాలర్లుగా ఉందని, సెప్టెంబర్‌లో ఇది 8.33 శాతానికి పడిపోరుుందని పేర్కొన్న అత్యున్నత స్థారుు వర్గాలు, పసిడి దిగుమతులు పడిపోవడం దీనికి ప్రధాన కారణంగా తెలిపారుు. 2014-15 పూర్తి సంవత్సరంలో క్యాడ్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1.3 శాతం (26.8 బిలియన్ డాలర్లు). 2015-16లో ఇది 1.1 శాతానికి (22.1 బిలియన్ డాలర్లు) పడిపోరుుంది.  పసిడి దిగుమతులకు సంబంధించి ప్రధాన దేశాల్లో భారత్ కూడా ఒకటి. 2015-16లో దేశం 650 టన్నుల పసిడి దిగుమతులు చేసుకుంది.

 వెండి కూడా...: గణాంకాల ప్రకారం వెండి దిగుమతులు కూడా భారీగా పడిపోయారుు. 2015 సెప్టెంబర్ నెలతో పోల్చితే 2016 సెప్టెంబర్లో 71 శాతం పడిపోరుు, 484.74 మిలియన్ డాలర్ల నుంచి 139.16 మిలియన్ డాలర్లకు చేరారుు.

>
మరిన్ని వార్తలు