బంగారం దిగుమతులపై ఆంక్షలు!

18 Sep, 2018 01:36 IST|Sakshi

న్యూఢిల్లీ: డాలర్‌ మారకంలో రూపాయి విలువ కరిగిపోతోంది. ఇందుకు ప్రధాన కారణాల్లో దిగుమతుల పెరుగుదల, కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌) వంటివి కొన్ని. ఈ పరిస్థితుల్లో దిగుమతులను తగ్గించే చర్యల్లో భాగంగా క్రూడ్‌కు సంబంధించి ఏమీ చేయలేని పరిస్థితి. దీనితో సమీప కాలంలో పసిడి దిగుమతులపైనే కేంద్రం కీలక చర్యలు తీసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే  సుంకాలను పెంచడం కాకుండా, దిగుమతుల తగ్గింపునకు ఇతర చర్యలు తీసుకునే వీలుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  

స్మగ్లింగ్‌ భయాలు...
ప్రస్తుతం పసిడిపై దేశీయంగా 10 శాతం సుంకం అమలవుతోంది. సుంకాలు పెంపు అంశాన్ని కేంద్రం ఎందుకు పక్కన పెట్టవచ్చన్న అంశాలను పరిశీలిస్తే, ఇలా చేస్తే పసిడి స్మగ్లింగ్‌ సమస్య మరింత తీవ్రం అవుతుందని కేంద్రం భావిస్తోందని సమాచారం.

  క్యాడ్‌ను అరికట్టడానికి తీసుకోవాలని భావిస్తున్న అంశాల్లో అప్రధాన ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు విధించడం ఒకటి. ఇదే జరిగితే ఇందులో పసిడి తొలి వరుసలో ఉంటుందని  భావిస్తున్నారు. తదుపరి అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ పరికరాలు, రిఫ్రిజిరేటర్లు, వాచ్‌లు, విలువైన పాదరక్షలు, దుస్తులు ఉంటాయన్నది వారి విశ్వాసం. పసిడి దిగుమతులు జూలైలో 41%, ఆగస్టులో 93% పెరిగిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు