బంగారానికి ప్రతికూలమే!

26 Nov, 2018 12:18 IST|Sakshi

న్యూఢిల్లీ: బంగారం ధరలు గత వారంలో తక్షణ నిరోధ స్థాయి ఔన్స్‌ 1,230 డాలర్లను అధిగమించలేకపోయాయి. డిసెంబర్‌ నెల బంగారం ఫ్యూచర్స్‌ ఏ మార్పు లేకుండా ఔన్స్‌ 1,223.50 డాలర్ల వద్దే ఉండిపోయింది. గత శుక్రవారం చమురు ధరలు ఒక్కరోజే 7 శాతం పతనం చెందడం తెలిసిందే. చమురు ధరల పతనం కమోడిటీ మార్కెట్ల పట్ల ఇన్వెస్టర్‌ సెంటిమెంట్‌కు విఘాతం కలిగించిందని, ఇది బంగారానికి కూడా ప్రతికూలమేనని కామర్జ్‌ బ్యాంకు కమోడిటీ రీసెర్చ్‌ హెడ్‌ యూజెన్‌వీన్‌బర్గ్‌ పేర్కొన్నారు. తక్కువ చమురు ధరలు ద్రవ్యోల్బణ అంచనాలపైనా ప్రభావం చూపిస్తాయన్నారు.

బలహీన అయిల్‌ మార్కెట్‌ బంగారం ర్యాలీకి కష్టమేనని లండన్‌ క్యాపిటల్‌ గ్రూపు రీసెర్చ్‌ హెడ్‌ జాస్పర్‌ లాలెర్‌ అభిప్రాయపడ్డారు. అయితే, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి వాతావరణం అన్నది సురక్షిత పెట్టుబడి సాధనాలకు అనుకూలమేనన్నారు. సమీప కాలంలో ఔన్స్‌ బంగారం ధర 1,200 డాలర్ల పైనే కొనసాగొచ్చన్న అభిప్రాయాన్ని కూడా తెలిపారు. దేశీయంగా తగ్గిన డిమాండ్‌ అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, స్థానిక జ్యుయలర్స్‌ నుంచి డిమాండ్‌ తగ్గడం తదితర కారణాల వల్ల బంగారం ధరలు గత వారం 10 గ్రాములకు రూ.32,000లోపునకు దిగొచ్చాయి. 10 గ్రా.కు రూ.400 తగ్గి రూ.31,750కు చేరాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా సంక్షోభం : ముకేశ్ అంబానీ నష్టం ఎంతంటే

రికార్డు కనిష్టానికి బంగారం దిగుమతులు

దేశంలో తీవ్ర అత్యవసర పరిస్థితి: రాజన్

నేడు మార్కెట్లకు సెలవు

లాక్‌డౌన్: మొబైల్ యూజర్లకు ఊరట

సినిమా

కరోనా.. కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం

శుభవార్త చెప్పిన స్టార్‌ జంట

బిగ్‌బాస్‌: ‘అవును ప్రేమించుకుంటున్నాం’

యాంకర్‌ సుమ ఆడపడుచు మృతి

బ‌డా నిర్మాత కూతురికి క‌రోనా

కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టా: కార్తీక్‌ ఆర్యన్‌