పసిడి వెనకడుగు!

23 Feb, 2016 01:12 IST|Sakshi
పసిడి వెనకడుగు!

న్యూయార్క్/ముంబై: అంతర్జాతీయ మార్కెట్ నెమైక్స్‌లో బలహీన ధోరణి, దేశీయంగా కొనుగోళ్ల మద్దతు తగ్గడం వంటి కారణాలతో పసిడి సోమవారం వెనకడుగు వేసింది. కడపటి సమాచారం అందే సరికి  నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఫిబ్రవరి కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర క్రితం ధరతో పోల్చితే 21 డాలర్ల నష్టంతో 1,210 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి 15 డాలర్ల పైనే ట్రేడవుతున్నా... నష్టాల్లోనే ఉంది. ఇక దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్- మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో కూడా కడపటి సమాచారం అందే సరికి పసిడి 10 గ్రాముల ధర క్రితంతో పోల్చితే భారీగా రూ.535 క్షీణించి రూ.28,980 వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా కేజీకి రూ.534 నష్టంతో రూ.36.983 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే... మంగళవారం స్పాట్ మార్కెట్‌లో పసిడి ధర భారీగా తగ్గే అవకాశం ఉంది. కాగా సోమవారం ముంబై స్పాట్ మార్కెట్లో సైతం పసిడి 99.9 ప్యూరిటీ 10 గ్రాముల ధర రూ. 445 తగ్గి రూ.28,650కి చేరింది. 99.5 ప్యూరిటీ ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ.28,500కు చేరింది. వెండి కేజీ ధర రూ.655 తగ్గి రూ.37,035కు చేరింది.

>
మరిన్ని వార్తలు