-

బంగారం ధర మళ్లీ 29 వేలకు

9 Aug, 2014 03:38 IST|Sakshi
బంగారం ధర మళ్లీ 29 వేలకు

ముంబై: బంగారం ధర శుక్రవారం నెల గరిష్ట స్థాయిని తాకింది. అమెరికా-ఇరాక్, రష్యా-ఉక్రేయిన్, ఇజ్రాయెల్-గాజాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ నుంచి అందుతున్న మద్దతు పసిడి ధర పెరుగుదలకు ఒక కారణం. ఈ పరిస్థితుల్లో దేశీయంగా స్టాకిస్టుల కొనుగోళ్లూ కనకం ధరకు ఊతం ఇస్తున్నాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్ కమోడిటీ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్ (31.1.గ్రా)కు దాదాపు 1315 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. ముంబై స్పాట్ మార్కెట్‌లో శుక్రవారం 10 గ్రాముల పూర్తి స్వచ్ఛత ధర గురువారం ముగింపు ధరతో పోల్చితే శుక్రవారం రూ.210 పెరిగింది. రూ.28,735 వద్ద ముగిసింది.

ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి రూ.28,585 వద్ద ముగిసింది. ఢిల్లీలో ధర రెండు నెలల గరిష్ట స్థాయిలో మళ్లీ రూ. 29 వేల పైకి ఎగసింది. ఇతర ప్రధాన నగరాల్లోనూ ధరలు ఇదే స్థాయికి చేరాయి. కాగా అంతర్జాతీయంగా పలు దేశాల మధ్య నెలకొన్న ఘర్షణాత్మక పరిస్థితుల్లో క్రూడ్ ధరలు సైతం స్వల్పకాలంలో కొంతమేర పెరిగే అవకాశం ఉందని నిపుణుల విశ్లేషణ.

మరిన్ని వార్తలు