పరుగులు పెడుతున్న పసిడి ధర

27 Aug, 2013 13:07 IST|Sakshi
పరుగులు పెడుతున్న పసిడి ధర

ముంబయి : రూపాయి దెబ్బకు బంగారం ధర పరుగులు పెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెద్దగా పెరగకున్నా.. మన మార్కెట్లో మాత్రం ధర వేగంగా పెరుగుతోంది. గడిచిన నెల రోజులుగా 7 వేల రూపాయల దాకా పెరిగిన 10 గ్రాముల ధర మంగళవారం మరో 600 రూపాయల దాకా పెరిగింది.

ఎంసీక్స్లో ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర 32,500 రూపాయలకు సమీపంలో ట్రేడవుతోంది. కేజీ వెండి ధర 1150 రూపాయల దాకా లాభపడుతూ 55 వేల రూపాయలకు సమీపంలో ట్రేడవుతోంది. రూపాయి పతనం ఇలాగే కొనసాగితే బంగారం 35 వేలకు, వెండి 60 వేల రూపాయలకు త్వరలోనే చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు