స్వల్పంగా తగ్గిన బంగారం ధర

22 May, 2020 10:34 IST|Sakshi

ఈ వారంలో వరుసగా మూడు రోజులు భారీగా పెరిగిన పసడి ధర నిన్నటి నుంచి తగ్గుముఖం పట్టింది. శుక్రవారం ఉదయం 10:20 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీ కమోడి మార్కెట్లో రూ.338 తగ్గి 10 గ్రాముల పసిడి రూ. 46,649 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర తగ్గింది. నిన్నటితో పోలిస్తే 15 డాలర్లు తగ్గి ఔన్స్‌ బంగారం 1,727 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇప్పటికీ అమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య అనిశ్చితి నెలకొనడం, అమెరికా స్టాక్‌ ఎక్సెంజ్‌ నుంచి 800 చైనాల కంపెనీలను డిలిస్ట్‌ చేయడానికి యూఎస్‌ సెనెట్‌లో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం తెలపడంతో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య సంక్షోభం మరింత తీవ్రమైంది. ఈ నేపథ్యంలోనే బంగారం ధర తగ్గుముఖం పట్టిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Related Tweets
మరిన్ని వార్తలు