భారీగా తగ్గిన పసిడి ధర

6 Jun, 2020 10:32 IST|Sakshi

 శనివారం  బంగారం ధర భారీగా తగ్గింది. శుక్రవారం ఉదయం సెషన్‌లో 10 గ్రాముల పసిడిధర రూ.300 పెరిగి మార్కెట్‌ ముగిసే సమయానికి 10 గ్రాముల పసిడి రూ.656 తగ్గి రూ.45,732 వద్ద ముగిసింది.అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర భారీగా పతనమైంది. గురువారంతో పోలిస్తే ఔన్స్‌ బంగారం 28 డాలర్లు తగ్గి, 1,688.35 డాలర్ల వద్ద ముగిసింది. ప్రపంచ వ్యాప్తంగా గోల్డ్‌ డీలర్స్‌ బంగారంపై భారీ ఆఫర్లు ప్రకటింస్తుండడంతో ధరలు దిగివస్తున్నాయి. అంతేగాకుండా అంతర్జాతీయంగాను దేశీయంగాను ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవ్వడం, ఇన్వెస్టర్లు బంగారాన్ని విక్రయించేందుకు మొగ్గు చూపుతుండడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Related Tweets
మరిన్ని వార్తలు