పుత్తడి పరుగు

18 Aug, 2017 00:02 IST|Sakshi
పుత్తడి పరుగు

ఢిల్లీలో రూ. 30,000 దాటిన ధర
న్యూయార్క్‌/ముంబై: అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌– ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ ఏడాది ఇక ఫండ్‌ రేటును (ప్రస్తుత శ్రేణి 1–1.25 శాతం) పెంచే అవకాశం లేదన్న అంచనాలు బంగారానికి బలాన్ని ఇస్తున్నాయి. దీంతో అంతర్జాతీయంగా కమోడిటీ ఎక్సే్ఛంజ్‌–నైమెక్స్‌లో ఔన్స్‌ (31.1గ్రా) ధర గురువారం ఒక దశలో బుధవారం ముగింపుతో పోల్చితే 12 డాలర్లు పెరిగి 1,295 డాలర్లకు చేరింది.  గురువారం న్యూఢిల్లీ మార్కెట్లో పుత్తడి తిరిగి రూ. 30,000 స్థాయిని అధిగమించింది.

 99.9 స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ. 30,050 వద్ద ముగిసింది. ముంబై  స్పాట్‌ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత 10 గ్రాముల పసిడి ధర రూ.305 పెరిగి రూ.29,110కి ఎగసింది. 99.5 స్వచ్ఛత ధర కూడా అంతే ఎగసి రూ.28,960కి చేరింది. వెండి కేజీ ధర రూ.745 పెరిగి రూ. 39,000కి ఎగసింది. కడపటి సమాచారం మేరకు ఫ్యూచర్స్‌ మార్కెట్‌–మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి కాంట్రాక్ట్‌ ధర రూ.200 లాభంతో రూ.29,150 వద్ద ట్రేడవుతోంది. వెండి రూ.250 లాభంతో రూ.39,100 వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు