2 వారాల కనిష్టానికి పసిడి

22 May, 2019 13:40 IST|Sakshi

దిగి వస్తున్న వెండి, బంగారం ధరలు

 నాలుగు సెషన్లలో రూ.660 క్షీణించిన 10 గ్రా. పుత్తడి

సాక్షి, ముంబై : అంతర్జాతీయంగా బంగారం ధరలు బలహీనత కొనసాగుతోంది. మంగళవారం నాటికి గత  నాలుగు  సెషన్లలో పుత్తడి ధర రూ. 660 లుపతనమైంది. ముఖ్యంగా ఫెడరల్‌ రిజర్వ్‌  తాజా పాలసీ సమావేశం నేపథ్యంలో డాలరుకు డిమాండ్‌ పెరిగింది. దీంతో పసిడి ధరలు రెండు వారాల కనిష్టానికి చేరాయి.  ఇది దేశీయంగా కూడా ప్రభావితం చేస్తోంది. 

అమెరికా చైనా ట్రేడ్‌వార్‌కు సంబంధించి స్వల్ప ఊరట లభించడంతో  అమెరికా యూఎస్‌ ట్రెజరీ బాండ్‌ ఈల్డ్‌ విపరీతంగా పెరిగి డాలర్‌ బలపడేందుకు సహకరించింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలరు  విలువ పుంజుకుంది. డాలర్‌ ఇండెక్స్‌ 4వారాల గరిష్టానికి చేరుకోవడంతో ప్రపంచమార్కెట్లో పసిడి 2వారాల కనిష్ట ధర వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా మార్కెట్లో బుధవారం ఔన్స్‌ పసిడి ధర స్వల్ప లాభంతో 1,273.65 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. దేశీయంగానూ  ఫ్లాట్‌ధోరణి కొనసాగుతోంది. 

అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే పసిడి ధర దేశీయంగా అక్కడక్కడే ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో జూన్‌ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.31ల లాభంతో రూ.31447ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. పసిడి ధరను ప్రభావితం చేసే రూపాయి విలువ డాలర్‌ మారకంలో 5 పైసలు క్షీణించి  69.76 స్థాయి వద్ద ఉంది. 

మరిన్ని వార్తలు