పటిష్టంగా పసిడి..

1 Jul, 2019 11:14 IST|Sakshi

బంగారం అనూహ్యరీతిలో పటిష్టస్థాయిలో ఉంది. అంతర్జాతీయ కమోడిటీ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– నైమెక్స్‌లో 28వ తేదీతో ముగిసిన మొత్తం ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర 1,400 డాలర్లపైనే కొనసాగింది. వారం ప్రారంభంలో 1,404 డాలర్ల వద్ద ప్రారంభమైన పసిడి ధర, వారం మధ్యలో (జూన్‌ 25వ తేదీ) 1,442 డాలర్లను చూసింది.  అయితే అదేరోజు 1,433 డాలర్ల వద్ద ముగిసింది. ఈ రెండు స్థాయిలూ పసిడికి ఆరు సంవత్సరాల గరిష్టం కావడం గమనార్హం.

వారం చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో వారంవారీగా దాదాపు 24 డాలర్ల లాభంతో 1,428 డాలర్ల వద్ద ముగిసింది. రెండేళ్లలో కీలకమైన 1,360 డాలర్ల స్థాయిని దాటిన తర్వాత పసిడి మరో కీలక నిరోధం 1,400 డాలర్లపైన ట్రేడవుతోంది. దిగువస్థాయికి వెళ్లాలంటే ఈ రెండు మద్దతులనూ పసిడి కాపాడుకోవాల్సి ఉంటుంది. అయితే పసిడిది బులిష్‌ ధోరణేనన్నది నిపుణుల అభిప్రాయం. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, భౌగోళిక ఉద్రికత్తలతో పసిడిలోకి పెట్టుబడులు మారుతున్నట్లు విశ్లేషణలు ఉన్నాయి. ఇక భారత్‌లో కూడా పసిడి పటిష్టంగానే కొనసాగే వీలుంది

మరిన్ని వార్తలు