మళ్లీ పసిడి పరుగు..

27 Jan, 2020 10:48 IST|Sakshi

ముంబై : బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ భగ్గుమన్నాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల అనిశ్చితి పసిడికి కలిసివచ్చింది. ఎంసీఎక్స్‌లో సోమవారం వరుసగా మూడోరోజు పదిగ్రాముల బంగారం రూ 200 పెరిగి రూ 40,560కు ఎగబాకింది. చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందనే అంచనాతో మదుపురులు బంగారంపై పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. వెండి ధరలు సైతం భారమవుతూ కిలో రూ 47,291కి పెరిగి రూ 50,000కు చేరువయ్యాయి.

చదవండి : చమురు మంట.. పసిడి పంట

మరిన్ని వార్తలు