రూ.30వేలు దాటిన బంగారం ధర..మరింత పైకేనా?

4 Sep, 2017 12:33 IST|Sakshi
రూ.30వేలు దాటిన బంగారం ధర..మరింత పైకేనా?

సాక్షి:న్యూఢిల్లీ: జియోపొలిటికల్‌ ఆందోళనలు, అమెరికా డాలర్‌  బలహీనత నేపథ్యంలో  బంగారంలో పెట్టుబడులు వెల్లు వెత్తుతున్నాయి. కొనుగోళ్ల జోరుతో  దేశీయంగా పుత్తడి రూ.30వేల  కీలక స్థాయిని అధిగమించాయి.  అటు వెండి ధరలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా  ఇతర   మెటల్‌ షేర్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. 

ముఖ్యంగా మరిన్నిక్షిపణులను పరీక్షిస్తామంటున్న కిమ్‌ దూకుడు  అటు అంతర్జాతీయంగానూ ,ఇటు దేశీయంగా బంగారానికి డిమాండ్‌ పెంచుతోంది. ఈ నేపథ్యంలో  సోమవారం విదేశీ మార్కెట్లో పసిడి ధర హైజంప్‌ చేసింది. ఔన్స్‌ 1322 డాలర్లకు దాటేసింది. న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్(0.7 శాతం పెరిగి 1,333.28 డాలర్లకు చేరుకుంది. నవంబర్ 9 నుంచి 1,336.79 డాలర్లకు చేరుకుంది.  తద్వారా 10 నెలల గరిష్టాన్ని నమోదు చేసింది.
ఈ ప్రభావం  దేశీయంగానూ  కనిపిస్తోంది.  ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. రూ. 360పైగా  ఎగసి రూ.30,169 స్థాయికి చేరింది. ఈ పరుగు మరింత  పెరిగే అవకాశమున్నట్లు విశ్లేషకుల అంచనా. గ్లోబల్ బంగారం ధరలు మరింత పురోగమిచనున్నాయని అతి త్వరలోనే 1,375  డాలర్లకు చేరుతుందని  వింగ్ ఫుంగ్ ఫైనాన్షియల్ గ్రూప్ విశ్లేషకుడు చెప్పారు.

2018  మధ్యవరకు ఫెడరల్ రిజర్వ్ రేట్లుపెంపు ఉండదనీ, ఇది బంగారం ధరలకుసానుకూలమని భావిస్తున్నారు. ముఖ్యంగా  ఆగస్టులో ధరల పెరుగుదల 4.1 శాతం  ఎగిసి జనవరి నాటి స్థాయిని అధిగమించిన బంగారం ఇంకా పెరగనుందని మిత్సుబిషి విశ్లేషకుడు జోనాథన్ బట్లర్  పేర్కొన్నారు. ఫెడ్‌ రేట్లు పుంపు, డాలర్‌ బలం తదితర అంచనాలను బంగారం ధరలపై  ఒత్తిడిపెంచనుందని మరికొందరు భావిస్తున్నారు.  మరోవైపు  ప్రపంచ మార్కెట్లు బలహీనంగా  ఉండగా, డాలర్‌కు వ్యతిరేకంగా  ఇతర ప్రపంచ కరెన్సీలు సానుకూలగా కదులుతున్నాయి.  

కాగా ఐక్యరాజ్యసమితి ఆంక్షలను సైతం లెక్కచేయకుండా  ఇకపై మరిన్ని ప్రయోగాలు చేపడతామని స్పష్టం చేసింది. ఉత్తర కొరియా  ఆరవ అణు పరీక్షను నిర్వహించడంతో పాటు ఆధునిక హైడ్రోజన్ బాంబు  హెచ్చరికలనుకూడా ప్రకటించింది. దీంతోఈ వ్యవహారంపై   సమీక్షించేందుకు  అటు అమెరికా సెక్యూరిటీ  కౌన్సిల్‌ అత్యవసరంగా  ఈ రోజు సమావేశంకానున్నట్టు తెలుస్తోంది.
 

మరిన్ని వార్తలు