రూ.35 వేలు దాటేసిన పసిడి 

11 Jul, 2019 19:54 IST|Sakshi

రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర 

ఒక్క రోజులో రూ. 930 హై జంప్‌

గ్లోబల్‌ కారణాలు, డాలర్‌ వీక్‌నెస్‌

సాక్షి,ముంబై : నిన్నగాక మొన్న రూ. 600  తగ్గి మురిపించిన బంగారం ధరలు గురువారం రికార్డు స్తాయిలో పైకి ఎగిసాయి. ఒక్కరోజే 10 గ్రాముల బంగారంపై రూ.930 పెరగడం అటు బులియన్‌ వర్గాలకు, ఇటు కొనుగోలుదారులకు షాక్‌ ఇచ్చింది. వెండి ధరలది కూడా ఇదే బాట. న్యూ ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.930 పెరిగి రూ.35,800 పలుకుతోంది. 99.5 స్వచ్ఛత గల బంగారం ధర రూ.35,630 గా ఉంది. 8 గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ.100 పెరిగి రూ.27,400గా నమోదైంది.  

హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.36,290గా ఉండగా, 22 క్యారెట్ బంగారం ధర రూ.33,270 పలుకుతోంది. వెండి ధర  కేజీకి రూ.300 పెరిగి రూ.39,200గా ఉంది.  మార్కెట్‌లో 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.81,000 కాగా, అమ్మకం ధర రూ.82,000.  అంతర్జాతీయంగా మార్కెట్‌లో  ఔన్స్ బంగారం ధర  0.3శాతం పెరిగి 1,423 డాలర్లుగా ఉంది. మార్కెట్‌లో ఔన్స్ వెండి ధర 15.24 డాలర్లు. ఫెడ్‌ వడ్డీరేట్ల కోత ఉంటుందని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పోవెల్ సూచనప్రాయంగా అందించిన సంకేతాలతో  తోడు అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించారని  బులియన్‌ వర్గాల అంచనా. అటు డాలరు మారకంలో రుపీ  కూడా 11 వారాల గరిష్టం వద్ద బలంగానే ముగిసింది.  నాలుగు రోజులనష్టాలకు చెక్‌ చెప్పిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు  266 పాయింట్లు ఎగిసి పాజిటివ్‌గా ముగిసాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!

విప్రోకు ఉజ్వల భవిష్యత్‌: ప్రేమ్‌జీ

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

ఎక్కడైనా వైఫై కనెక్టివిటీ !

అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ తాత్కలిక మూసివేత

కొనుగోళ్ల జోష్‌ : లాభాల్లోకి సూచీలు 

ఎయిరిండియాకు భారీ ఊరట

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

మందగమనానికి ఆనవాలు!

27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి రేటు

జీవీకే ఎయిర్‌పోర్టులో 49% వాటా విక్రయం!

మార్కెట్లో ‘వాటా’ ముసలం!

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!

పావెల్‌ ‘ప్రకటన’ బలం

పెద్దలకూ హెల్త్‌ పాలసీ

మీ బ్యాంకులను అడగండయ్యా..!

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ మరో భారీ కుంభకోణం 

ఇక రోబో రూపంలో ‘అలెక్సా’

ఐఫోన్‌ ధర రూ.40వేల దాకా తగ్గింపు

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!