పసిడికి పండుగ కళ : భారీగా పెరిగిన ధర

15 Oct, 2018 19:34 IST|Sakshi

సాక్షి, ముంబై: పండుగశోభతో బంగారం ధరలు కళ కళలాడుతున్నాయి. సోమవారం పసిడి ధర రూ.200 పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.32,250కి చేరింది. విలువైన మెటల్స్‌లో  మరో కీలకమైన వెండి కూడా పసిడి బాటలోనే  పయనించింది. గత కొద్ది రోజులు నుంచి భారీగా తగ్గుతూ వచ్చిన వెండి ధర నేడు అమాంతం పెరిగింది. రూ.350 పెరగడంతో కేజీ వెండి రూ.39,750కి చేరింది.

ప్యూచర్స్‌ మార్కెట్‌లో ఒక దశలో 400రూపాయలకు పైగా పుం/iకున్న  బంగారం పది గ్రా. ధర  32వేల మార్క్‌ను క్రాస్‌ చేసింది.  ప్రస్తుతం ధర పది గ్రా. రూ. 266 లాభంతో 32, 112 వద్ద ఉంది.  ఢిల్లీలో, 99.9శాతం, 99.5శాతం స్వచ్ఛత పది గ్రాముల రూ .200 చొప్పున  లాభపడి వరుసగా రూ .32,250 కు రూ. 32,100 గా నమోదయ్యాయి. సావరిన్ బంగారం ధరలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. ఎనిమిది గ్రాముల బంగారం 100 రూపాయలు పెరిగి 24,700 వద్ద ఉంది. అలాగే సిల్వర్ కిలోకు 350 రూపాయలు పెరిగి 39,750 రూపాయలుగా ఉంది. 

అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు, పండగ సీజన్‌, స్థానిక నగల వర్తకుల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్‌ ఊపందుకోవడంతో బంగారం ధర పెరిగినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. గ్లోబల్ మార్కెట్లలో, బంగారం ధరలు  1శాతం పుంజుకోవడం, బలహీనమైన ఆసియా స్టాక్ మార్కెట్లు,  చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం, అమెరికా ఫెడ్‌ అధిక వడ్డీరేట్లు బంగారం ధరలను ప్రభావితం చేసినట్టు తెలిపారు. స్టాక్ మార్కెట్ క్రాష్ తరువాత గోల్డ్ మరింత ఆకర్షణీయంగా ఉందని సింగపూర్ డీలర్ గోల్డ్‌ సిల్వర్ సెంట్రల్ మేనేజింగ్ డైరెక్టర్ బ్రియాన్ లాన్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు