గోల్డ్‌ రేస్‌ : రూ 41,000కు చేరిన పసిడి

6 Jan, 2020 14:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో పసిడి పరుగులు పెడుతోంది. రెండు రోజుల్లోనే రూ 1800 పెరిగిన పదిగ్రాముల బంగారం సోమవారం ఎంసీఎక్స్‌లో ఏకంగా రూ 41,000 ఆల్‌టైం హైకి ఎగబాకింది. అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ మేఘాలు ముసురుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా షేర్‌ మార్కెట్లు పతనమవుతుంటే ముడిచమురు, బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో సోమవారం ఔన్స్‌ బంగారం ఏడేళ్ల గరిష్టస్ధాయికి చేరింది.

అమెరికా డ్రోన్‌ దాడిలో ఇరాక్‌ కమాండర్‌ మృతితో ఇరు దేశ నేతల మధ్య పరస్పర సవాళ్ల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలుతుంటే మెరుగైన పెట్టుబడిసాధనంగా బంగారంవైపు మదుపుదారులు మొగ్గుచూపడంతో పసిడి ధర పైపైకి వెళుతోంది. బంగారం ధరలు మున్ముందు మరింత భారమవుతాయని త్వరలోనే పదిగ్రాముల బంగారం రూ 42,000కు చేరుతుందని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

చదవండి : బంగారం.. చమురు భగ్గు!

మరిన్ని వార్తలు