బంగారం ధరలు పైపైకి ..

13 Apr, 2020 13:01 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశ  వ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ కారణంగా ఫిజికల్ కొనుగోళ్లు పడిపోయినప్పటికీ బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. భారతదేశంలో బంగారం ధరలు ఫ్యూచర్ మార్కెట్లలో రికార్డు స్థాయిని తాకాయి.  సోమవారం  ఒక శాతానికిపైగా పుంజుకుని రికార్డును  స్థాయికి చేరాయి.  ఎంసీఎక్స్ లో జూన్  పసిడి  ఫ్యూచర్స్ 10 గ్రాములకు 45,800కు చేరుకుంది. మరో విలువైన మెటల్ వెండి కూడా ఇదే బాటలో వుంది. మే నెల వెండి ఫ్యూచర్స్ కిలోకు 0.4 శాతం పెరిగి 43,670కు చేరుకుంది. బంగారం ధరలు పెరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తోందని, మొత్తం ధోరణి సానుకూలంగా ఉందని ఎస్‌ఎంసి గ్లోబల్ ఒక నోట్‌లో పేర్కొంది. బంగారానికి  పది గ్రాముల ధర రూ. 45 వేల దగ్గర, వెండి  కిలో ధర  42,500  రూపాయల వద్ద గట్టి మద్దతు వుందని తెలిపింది.

గ్లోబల్ మార్కెట్లలో, ఈ రోజు బంగారం రేట్లు ఫ్లాట్ గా ఉన్నప్పటికీ ఒక నెల గరిష్ట స్థాయి వద్ద స్థిరంగా ఉన్నాయి.  కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి  నేపథ్యంలో గత వారం యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటించిన, తాజా ఉద్దీపన చర్యల మధ్య ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు,  బంగారానికి మద్దతు ఇస్తున్నాయని   నిపుణుల అంచనా. స్పాట్ బంగారం ఔన్సు1,687 డాలర్లుగా వుంది. ఇతర విలువైన లోహాలలో, వెండి 0.5శాతం పెరిగి 15.40 డాలర్ల వద్ద,, ప్లాటినం 0.3శాతం క్షీణించి 745.74 డాలర్లకు చేరుకుంది.  (కరోనా : రిలయన్స్ శాస్త్రవేత్తల ముందడుగు)

భారతదేశంలో,మూడు వారాల లాక్ డౌన కారణంగా బంగారం భౌతిక కొనుగోళ్లు నిలిచిపోయాయి. అంతేకాదు లాక్ డౌన్ పొడిగింపుపై అనిశ్చితి కారణంగా జ్యువెలర్స్ మే డెలివరీకి కూడా ఆర్డర్లు ఇవ్వడం లేదని ముంబైకి చెందిన డీలర్‌ను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. రికార్డు ధరలు, లాక్ డౌన్ కారణంగామార్చిలో భారత బంగారు దిగుమతులు సంవత్సరానికి 73శాతం పడిపోయిన సంగతి తెలిసిందే. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం)

చదవండి : కరోనా : ఎగతాళి చేసిన టిక్‌టాక్ స్టార్ కు పాజిటివ్ 

మరిన్ని వార్తలు