పసిడి మళ్లీ పైపైకి..

3 Mar, 2020 18:15 IST|Sakshi

ముంబై : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తిపై భయాందోళనల నేపథ‍్యంలో పసిడి ధరలు మళ్లీ పైకెగిశాయి. మంగళవారం వరుసగా రెండోరోజూ బంగారం ధరలు ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలకు అనుగుణంగా దేశీ మార్కెట్‌లోనూ బంగారం భారమైంది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల పసిడి రూ 514 పెరిగి రూ 42,470 పలికింది. ఇక బంగారం బాటలోనే వెండి ధరలు సైతం భగ్గుమన్నాయి. కిలో వెండి రూ 711 భారమై రూ 45,272 పలికింది. కరోనా భయాలతో బంగారం ధరలు కొద్దిరోజులు ఒడిదుడుకులతో సాగినా స్ధిరంగా ముందుకే కదులుతాయని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

చదవండి : బంగారం ‘బంగారమే’ : మళ్లీ పెరిగింది

మరిన్ని వార్తలు