టర్కీ సంక్షోభం.. పసిడికి ఊతం..!

13 Aug, 2018 01:32 IST|Sakshi

న్యూఢిల్లీ: టర్కీ కరెన్సీ సంక్షోభ ప్రభావాలు యూరప్‌నకు కూడా విస్తరించవచ్చన్న ఆందోళన నేపథ్యంలో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పరిగణించే పసిడి ధరలకు మళ్లీ రెక్కలొచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుత ధరల్లో ఇన్వెస్టర్లు మళ్లీ బంగారం కొనుగోళ్లపై ఆసక్తి చూపిస్తుండటంతో పసిడి పుంజుకోవచ్చని బ్లూలైన్‌ ఫ్యూచర్స్‌ ప్రెసిడెంట్‌ బిల్‌ బరూచ్‌ పేర్కొన్నారు. యూరోతో పోలిస్తే గడిచిన వారంలో పుత్తడి ధర 1.4 శాతం పెరగడం ఈ అంచనాలకు బలమిస్తున్నాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.

అమెరికాతో విభేదాల నేపథ్యంలో టర్కీ కరెన్సీ లీరా మారకం విలువ గణనీయంగా పడిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు, టర్కీ సంక్షోభానిది ప్రపంచ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపేంత స్థాయి కాదని, అమెరికా డాలర్‌తో పసిడికి తీవ్ర పోటీ కొనసాగుతుందని మరికొన్ని వర్గాలు భావిస్తున్నాయి.  ఇటీవలి 12 నెలల కనిష్ట స్థాయి దగ్గరే పసిడి రేట్లు తిరుగాడుతున్నందున టెక్నికల్‌గా ఇంకా డౌన్‌ ట్రెండ్‌లోనే ఉన్నట్లు పలువురు విశ్లేషకులు తెలిపారు.

మొత్తానికి 1,205 –1,200 డాలర్ల(ఔన్సు ధర) రేటు కీలకమని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఇంతకన్నా తగ్గితే పసిడి ఔన్సు (31.1 గ్రాములు) రేటు 1,180 డాలర్లకి క్షీణించవచ్చని, ఒకవేళ పెరిగితే 1,220–1,227 డాలర్ల స్థాయి కీలకంగా మారుతుందని.. దాన్ని అధిగమించిన పక్షంలో స్వల్పకాలంలో 1,250 దాకా ర్యాలీకి అవకాశం ఉందని వివరించాయి. న్యూయార్క్‌ కమోడిటీ ఎక్సే్ఛంజీలో పసిడి ధర ఔన్సుకు స్వల్పంగా క్షీణించి.. 1,211.20 డాలర్ల వద్ద క్లోజయ్యింది.

దేశీయంగా పెరిగిన పుత్తడి..
అంతర్జాతీయంగా బలహీన ట్రెండ్‌ ఉన్నా.. దేశీయంగా మాత్రం పండుగల సీజన్‌ నేపథ్యంలో స్థానిక జ్యుయలర్ల కొనుగోళ్ల మద్దతుతో పసిడి రేట్లు వారాం తంలో పెరిగాయి. న్యూఢిల్లీలో మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ. 150 పెరిగి రూ. 30,520 వద్ద ముగిసింది. ఆభరణాల బంగారం కూడా అంతే పెరుగుదలతో రూ. 30,550 వద్ద క్లోజయ్యింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మీ బ్యాంకులను అడగండయ్యా..!

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ మరో భారీ కుంభకోణం 

ఇక రోబో రూపంలో ‘అలెక్సా’

ఐఫోన్‌ ధర రూ.40వేల దాకా తగ్గింపు

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

ప్రపంచ బ్యాంకు ఎండీ, సీఎఫ్‌వోగా అన్షులా

స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం

మీ భూమి చరిత్ర!!

ఇక విదేశాలకూ విస్తారా విమాన సర్వీసులు

మార్కెట్లోకి ‘ఇథనాల్‌’ టీవీఎస్‌ అపాచీ

ఇండస్‌ ఇండ్‌కు బీఎఫ్‌ఐఎల్‌ దన్ను

లాభాల్లోకి ట్రూజెట్‌!

మెప్పించిన ఇన్ఫీ!

ఇండిగోకు మరో షాక్ ‌

రీటైల్‌​ ద్రవ్యోల్బణం పైకి, ఐఐపీ కిందికి

38 శాతం ఎగిసిన ఇండస్‌ ఇండ్‌ లాభం

అదరగొట్టిన ఇన్ఫీ

చివరికి నష్టాలే

లాభనష్టాల మధ్య తీవ్ర ఒడిదుడుకులు 

సుజుకి జిక్సెర్‌ కొత్త బైక్‌..

పది విమానాలతో ట్రుజెట్‌ విస్తరణ

150 పాయింట్ల లాభం : 11600 పైకి నిఫ్టీ

హోండా ‘డబ్ల్యూఆర్‌–వీ’ కొత్త వేరియంట్‌

గూగుల్‌ మ్యాప్స్‌లో డైనింగ్‌ ఆఫర్లు

మెహుల్‌ చోక్సీ ఆస్తులు ఈడీ జప్తు

రుణ ప్రణాళికకు బ్యాంకర్లు ఓకే

రుణాల విషయంలో జాగ్రత్తగా ఉంటాం

భూముల అమ్మకంతో బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఊపిరి!

ఎయిరిండియాను అమ్మేసినా దేశీ సంస్థల చేతుల్లోనే

కళ్యాణి రఫేల్‌కు భారీ కాంట్రాక్టు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది