భగ్గుమన్న బంగారం

18 May, 2020 16:34 IST|Sakshi

సరికొత్త శిఖరాలకు స్వర్ణం..

ముంబై : ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 కేసులు విపరీతంగా పెరగడంతో పాటు అమెరికా-చైనా మధ్య  వాణిజ్య ఉద్రిక్తతలు పెచ్చుమీరడంతో బంగారం, వెండి ధరలు రికార్డుస్ధాయిలో భగ్గుమన్నాయి. చైనాపై అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శలతో చెలరేగడం, బీజింగ్‌ దీటుగా ప్రతిస్పందిస్తుండటంతో అనిశ్చితి వాతావరణం మదుపరులను బంగారం వైపు ఆకర్షిస్తోంది.

మరోవైపు ఈక్విటీ మార్కెట్లు కుదేలవడంతో పసిడిపై పెట్టుబడులకు మదపరులు ఆసక్తి కనబరుస్తున్నారు. బంగారానికి డిమాండ్‌ పెరగడంతో సోమవారం ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల పసిడి రూ 489 పెరిగి ఏకంగా రూ 47,870కి ఎగిసింది. ఇక కిలో వెండి రూ 1859 పెరిగి రూ 48,577కు ఎగబాకింది. హాట్‌ మెటల్స్‌ రెండూ త్వరలోనే రూ 50,000కు చేరువవుతాయని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

చదవండి : పెరిగిన బంగారం ధరలు.. లాభపడదామా..?

మరిన్ని వార్తలు