ధంతేరాస్‌లో మెరిసిన పసిడి

6 Nov, 2018 01:37 IST|Sakshi

న్యూఢిల్లీ: పసిడి కొనుగోళ్లకు శుభప్రదమైన రోజుగా భావించే ధంతేరాస్‌లో అమ్మకాలు 15 శాతం పెరిగాయి. ధరలు భారీగా ఉండడం, దీనికితోడు వ్యవస్థలో నగదు లభ్యత (లిక్విడిటీ) సమస్యలు ఉండడంతో ధంతేరాస్‌నాడు అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉండొచ్చని అంచనాలు వెలువడ్డాయి. అయితే ఇందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. పండుగల సీజన్‌ కొనసాగుతున్నదున, వచ్చే వారాల్లో పసిడి, ఆభరణాల కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనావేస్తున్నారు. ఆభరణాలకన్నా, నాణేలకు అధికంగా డిమాండ్‌ ఉందని వారు తెలిపారు.  

రూపాయి బలహీనత బలంగా...
‘రూపాయి బలహీనత వల్ల వచ్చే వారాల్లో పసిడి 10 గ్రాములకు రూ.35,000–40,000 వరకూ ధర పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ వార్తలు పసిడి డిమాండ్‌ను పునరుద్ధరించాయి. గత ఏడాదితో పోల్చితే అమ్మకాలు 10 శాతం అధికంగా ఉంటాయని బావిస్తున్నాం’ అని ఏఐజీజేడీసీ చైర్మన్‌ నితిన్‌ ఖండేల్‌వాల్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు