పసిడికి ఫెడ్‌ దెబ్బ

14 Jun, 2018 10:07 IST|Sakshi

సాక్షి, ముంబై:  అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపుతో బంగారం ధర క్షీణించింది. పావు శాతం వడ్డీరేటు పెంచుతూ   బుదవారం  ఫెడ్‌  నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు మరో రెండు సార్లు పెంపు  వుంటుందనే అంచనాలతో పసిడి బలహీనపడింది.  గ్లోబల్‌మార్కెట్‌లో  పసిడి 0.1 శాతం తగ్గి ఔన్స్‌ బంగారం ధర 1298.61 వద్ద  ఉంది.  1292 వద్ద ఒక వారం కనిష్టాన్ని తాకింది. కాగా దేశీయంగా బంగారం బుధవారం 150 రూపాయలు లాభపడింది.    ఎంసీఎక్స్‌  మార్కెట్‌లో పది గ్రా పసిడి 13 రూపాయిలు నష్టంతో 31,143 వద్ద ఉంది.
 

మరిన్ని వార్తలు