ఫెడ్‌ నిర్ణయం కోసం పసిడి ఎదురుచూపులు

10 Jun, 2020 10:10 IST|Sakshi

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఫెడ్‌ నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. ఆసియాలో బుధవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర నిన్నటి ముగింపు(1,721.90 డాలర్లు)తో పోలిస్తే 1డాలరు స్వల్ప లాభంతో 1,722.90 వద్ద ట్రేడ్‌ అవుతోంది. భారత వర్తమాన కాల ప్రకారం నిన్నరాత్రి అమెరికాలో ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ సమావేశం ప్రారంభమైంది. నేడు ఫెడ్‌ వడ్డీరేట్లపై ఫెడ్‌ తన వైఖరిని ప్రకటించనుంది. సాధారణంగా వడ్డీరేట్లు పెరిగితే పసిడి ధర తగ్గుతుంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ఫెడ్‌ మరోసారి వడ్డీరేట్ల తగ్గింపునకే మొగ్గుచూపవచ్చనే కొందరు మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. 

దేశీయంగానూ అదే ధోరణి
అంతర్జాతీయ ట్రెండ్‌కు తగ్గట్లుగానే దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో బుధవారం పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేటి ఉదయం10 గంటలక 10గ్రాముల పసిడి ధర రూ.23ల స్వల్ప లాభంతో  రూ.46617.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈక్విటీ మార్కెట్లో లాభాల స్వీకరణ, రూపాయి బలహీనతల కారణంగా నిన్న రాత్రి పసిడి ధర రూ.493ల లాభంతో రూ.46594 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు