రికవరీ : బంగారం ధరలు జంప్ చేశాయి

3 Jun, 2017 15:45 IST|Sakshi
రికవరీ : బంగారం ధరలు జంప్ చేశాయి
న్యూఢిల్లీ : బంగారం ధరలు రికవరీ అయ్యాయి. నేటి బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 300 రూపాయల మేర పెరిగి, 29,550గా నమోదైంది. అంతర్జాతీయంగా వస్తున్న బలమైన సంకేతాలు, స్థానిక జువెల్లర్స్ భారీగా కొనుగోళ్లు చేపడటంతో బంగారం ధరలు 300 రూపాయల మేర పెరిగాయని తెలిసింది. ఇటు వెండికీ పరిశ్రమ యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి వస్తున్న డిమాండ్ తో దీని ధరలు కూడా కేజీకి రూ.1,170 పెరిగి రూ.40,470గా నమోమైంది. అమెరికా జాబ్స్ డేటా పేలవంగా ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికవరీ అయ్యాయి.
 
జాబ్స్ డేటా పేలవంగా రావడంతో ఫెడరల్ రిజర్వు కూడా వడ్డీరేట్ల పెంపును క్రమవిధానంలో పెంచాలని చూస్తోంది. అంతేకాక దేశీయ స్పాట్ మార్కెట్లో స్థానిక జువెల్లర్స్ ఎక్కువగా బంగారం కొనుగోళ్లను చేపడుతున్నారు. దీంతో విలువైన ఈ మెటల్స్ ధరలు పెరిగాయని బులియన్ విశ్లేషకులు చెప్పారు. గ్లోబల్ గా గోల్డ్ ధర 1.04 శాతం పెరిగి ఒక ఔన్సు 1,278 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ కూడా 1.48 శాతం లాభపడి ఔన్స్ కు 17.53డాలర్లుగా ఉంది. దేశీయ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం ప్యూరిటీ గోల్డ్ ధరలు 300 రూపాయల చొప్పున పెరిగాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధరలు రూ.29,550, రూ.29,400 రూపాయలుగా ఉన్నాయి. నిన్నటి మార్కెట్లో ఇవి 100 రూపాయల మేర పడిపోయాయి. 
మరిన్ని వార్తలు