2000 డాలర్లకు బంగారం: గోల్డ్‌మెన్‌ శాక్స్‌

20 Jun, 2020 10:33 IST|Sakshi

డాలర్‌ క్షీణతతో డిమాండ్‌ 

ద్రవ్యోల్బణ లేకపోతే కరెక‌్షన్‌కు అవకాశం

వచ్చే ఏడాదిపై బ్రోకరేజ్‌ సంస్థ తాజా అంచనాలు

ప్రపంచ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర ఏడాది లోపు 2000డాలర్లకు అందుకుంటుందని అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ గోల్డ్‌మెన్‌ శాక్స్‌ అంచనా వేసింది. కరోనా వైరస్ సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితులు, ఆయా దేశాల కరెన్సీల క్షీణతలు బంగారం బలపడేందుకు తోడ్పడతాయని బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయపడింది. బంగారం ధర రానున్న 3నెలల్లో 1,800డాలర్లకు, 6నెలలకు 1900డాలర్లకు, ఏడాదిలోగా 2000డాలర్లకు చేరకుంటుందని అని గోల్డ్‌మెన్‌ శుక్రవారం విడుదల చేసిన తన నివేదికలో పేర్కోంది

డాలర్‌ క్షీణతతో బంగారానికి డిమాండ్‌:
కోవిడ్‌-19 సంక్షోభం తర్వాత ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమన భయాలు రానున్ను రోజుల్లో బంగారం ధరను నడిపిస్తాయని  బ్రోకరేజ్‌ విశ్వసిస్తుంది. వర్ధమాన మార్కెట్లో లాక్‌డౌన్‌ సడలింపుతో ప్రధాన వినియోగదారుల కొనుగోలు శక్తి పెరుగుతుందని తెలిపింది. ఇదే సమయంలో డాలర్‌ బలహీనతతో వారు ముందస్తు రక్షణాత్మక చర్యలో భాగంగా బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. 

ద్రవ్యోల్బణం లేకపోతే కరెక‌్షన్‌కు అవకాశం:
అంతా సవ్యంగా జరిగి ప్రపంచ ఆర్థిక ‍వ్యవస్థలు రివకరీ అయ్యి ద్రవ్యోల్బణం ఏర్పడకపోతే ., బంగారం ధర 2013లో సంభవించిన కరెక‌్షన్‌ను తిరిగి చూడవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ హెచ్చరించింది. అలాగే ఫెడ్ రిజర్వ్‌బ్యాంక్‌  తన ద్రవ్య విధాన మద్దతును ఉపసంహరించుకుంటుందని ఇన్వెస్టర్లు నమ్మడం ప్రారంభించినప్పుడు కూడా బంగారం ధరలో కరెక‌్షన్‌ రావచ్చని గోల్డ్‌మెన్‌ సంస్థ తెలిపింది. 

సెంట్రల్‌ బ్యాంకుల వడ్డీరేట్ల తగ్గింపు, భారీ ఉద్దీపన చర్యలు బంగారానికి డిమాండ్‌ను పెంచుతాయి. అలాగే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం, కరెన్సీ క్షీణత పరిస్థితులు నెలకొన్నపుడు ఇన్వెస్టర్లు బంగారాన్ని రక్షణాత్మక సాధనంగా వినియోగిస్తుంటారు.

  • ప్రపంచ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర శుక్రవారం 22డాలర్ల లాభంతో 1,753డాలర్ల వద్ద స్థిరపడింది. 
  • ఇక దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ఫ్యూచర్ల ధర రూ.582 లాభపడి రూ.రూ.47937లు వద్ద ముగసింది.
మరిన్ని వార్తలు