గృహ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

5 May, 2017 15:56 IST|Sakshi
గృహ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ : గృహ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ అందింది. జాప్యం చేసే ప్రాజెక్టులపై గృహ కొనుగోలుదారులకు చెల్లించే వడ్డీరేట్టు 10 శాతంగా నిర్ధారించినట్టు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీస్(ఆర్ఈఆర్ఏ) తెలిపింది. సేల్స్ అగ్రిమెంట్ లో భాగంగా హౌజింగ్ ప్రాజెక్టులు జాప్యమవుతున్నట్టు తాము పెట్టుబడి పెట్టిన మొత్తంపై కొనుగోలుదారులు  ఈ మొత్తాన్ని పొందవచ్చు. అంతకముందు ఒక్కో చదరపు అడుగులకు 5గా ఉన్న రేటు, దీని ప్రకారం ప్రస్తుత రేటు 10గా నిర్ణయించారు.  14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ రియల్ ఎస్టేట్ చట్టం అమలవుతుందని, మరో 14 రాష్ట్రాల్లో ఈ నిబంధనలు అమలుచేసే ప్రక్రియ జరుగుతుందని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు చెప్పారు.
 
ఈ చట్టం కింద ఏర్పాటుచేసిన రెగ్యులేటరీ వద్ద ప్రస్తుతం నడుస్తున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులన్నీ జూలై ఆఖరికల్లా రిజిస్ట్రర్ చేసుకోవాలని హౌసింగ్ అండ్ అర్బన్ పావర్టీ  ఆల్లేవియేషన్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ రాజీవ్ రంజన్ మిశ్రా చెప్పారు. ఈ చట్టం ఆపరేటర్ల బారిన పడుతున్న కొనుగోలుదారులకు రక్షణ కల్పిస్తుందని చెప్పారు. 2016 మార్చిలో ఇది పార్లమెంట్ లో ఆమోదం పొందగా.. ఈ నెల 1వ తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది.  
 
ఈ చట్టం నోటిఫై అయిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు.. ఆంధ్రప్రదేశ్, బిహార్, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, చత్తీష్ ఘడ్, అండమాన్ అండ్ నికోబార్, ఐలాండ్స్, చంఢీఘర్, దాద్రా అండ్ నగేర్ హవేళి, డామన్ అండ్ డయ్యూ, ఢిల్లీ, లక్షద్వీప్ లు ఉన్నాయి. మే 1వరకు కూడా తాము నిర్మించబోయే, నిర్మించిన ప్రాజెక్టులకు సంబంధించి సర్టిఫికెట్‌ పొందనివారు మూడు నెలల్లో పొందాల్సి ఉంటుందని రెగ్యులేటరీ స్పష్టం చేసింది. ప్రస్తుతం నిర్మిస్తున్న ఫ్లాట్లను డెవలపర్లు జూలై వరకు విక్రయించాలని కూడా రెగ్యులేటరీ ఆదేశించింది.  
 
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా