గుడ్‌ న్యూస్‌: వాట్సాప్‌ గ్రూప్‌ కాలింగ్‌ అప్‌డేట్‌ 

26 Nov, 2018 12:51 IST|Sakshi

వాట్సాప్‌లో గ్రూప్‌ కాలింగ్‌ ఇక ఈజీ

గతంలోని లోపాన్ని సవరించిన వాట్సాప్

ఒకేసారి  ముగ్గురితో డైరెక్ట్‌ కాలింగ్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: రోజుకొక కొత్త ఫీచర్‌తో వినియోగదారులను  ఆకట్టుకుంటున్న​ ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప​ తాజాగా మరో ఫీచర్‌ను లాంచ్‌ చేసింది.  ఇప్పటికే లాంచ్‌ చేసిన గ్రూప్‌ కాలింగ్‌ ఫీచర్‌లో లోపాలను సవరించి సరికొత్తగా దీన్ని తిరిగి లాంచ్‌ చేసింది. ఒకేసారి ఇద్దరు లేదా ముగ్గురుతో సంభాషించేలా కొత్త గ్రూప్‌కాలింగ్‌ బటన్‌ అప్‌డేట్‌ చేసింది. గతంలో తీసుకొచ్చిన గ్రూప్‌ కాలింగ్‌ బటన్‌ ఒకరికంటే ఎక్కువమందికి ఒకేసారి కాల్స్‌ చేయడంలో (వాయిస్‌, వీడియో) వైఫల్యం చెందింది. ఈ లోపాన్ని సవరించిన వాట్సాప్‌ సరికొత్తగా ఈ ఫీచర్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తెస్తోంది.  

గతంలోలా కాకుండా నార్మల్‌ కాల్‌ తరువాత మిగిలిన వారిని గ్రూప్‌కాలింగ్‌లోకి ఆహ్వనించడం కాకుండా డైరెక్టుగా ముగ్గురుతో మాట్లాడవచ్చని కంపెనీ తెలిపింది. ఈ సదుపాయం  2.18.110.17 బీటా వెర్షన్‌లో  అమల్లోకి ఉందని, వచ్చే నెలనుంచి అందరికీ అందుబాటులో వస్తుందని వెల్లడించింది.

కాగా ఒక పార్టిసిపెంట్‌ను సెలక్ట్ చేసుకుని, అనంతరం టాప్‌రైట్ కార్నర్‌లో కనిపించే యాడ్ పార్టిసిపెంట్ బటన్‌ క్లిక్ చేసి రెండవ పార్టిసిపెంట్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఇలా మరింతమంది పార్టిసిపెంట్స్‌ను గ్రూప్వాయిస్ కాల్‌లోయాడ్ చేసుకునే అవకాశాన్ని గతంలో కల్పించింది. అయితే ఇది అంతగా ఆకట్టుకోలేకపోవడంతో తాజా అప్‌డేట్‌ను జోడించింది. 

మరిన్ని వార్తలు